ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

HYD : గ్రేటర్‌లోని పలు ప్రాంతాల్లో చీకట్లు.. ఇక్కట్లు

ABN, First Publish Date - 2021-11-26T20:14:52+05:30

HYD : గ్రేటర్‌లోని పలు ప్రాంతాల్లో చీకట్లు.. ఇక్కట్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • అసాంఘిక శక్తులకు అడ్డా
  • భయాందోళనలో పౌరులు
  • కొత్తగా మరిన్ని ప్రాంతాల్లో అలుముకున్న చీకట్లు


గ్రేటర్‌ పరిధిలో కొత్తగా చాలా ప్రాంతాలు అంధకారమయమవుతున్నాయి. సాంకేతిక పర్యవేక్షణలో లోపాలు, అధికారుల నిర్లక్ష్యంతో నగరంలోని కొన్ని ఏరియాలు అసాంఘిక శక్తులకు అడ్డాగా మారుతున్నాయి.


హైదరాబాద్‌ సిటీ : నగరంలో వీధి దీపాలు వెలగని చోట మాటువేస్తోన్న ఆగంతుకులు చైన్‌స్నాచింగ్‌, దారి దోపిడీ వంటి వాటితోపాటు ఆ మార్గంలో వచ్చే మహిళలను వేధిస్తున్నారు. ఎల్‌ఈడీ దీపాల ఏర్పాటుతో 50 శాతం మేర విద్యుత్‌ బిల్లు ఆదా చేశామని గొప్పలు చెప్పుకుంటోన్న జీహెచ్‌ఎంసీ.. గ్రేటర్‌లో 30 శాతం వరకు వీధి దీపాలు వెలగడం లేదన్న విషయాన్ని గుర్తించ లేకపోతోంది. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం 10 వేలకుపైగా డార్క్‌ స్పాట్‌లు గుర్తించామని, ఆ ఏరియాల్లో వీధి దీపాలు ఏర్పాటు చేసినట్టు సంస్థ గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.


14 వేలకుపైగా ప్రాంతాల్లో...

రెండేళ్ల క్రితం గుర్తించిన 14,308 డార్క్‌ స్పాట్‌లలో వీధి దీపాల ఏర్పాటు పూర్తయిందని బల్దియాలోని విద్యుత్‌ విభాగం వర్గాలు చెబుతున్నాయి. క్షేత్రస్థాయి పరిశీలన, స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీ, బస్తీ సంఘాల సమాచారం మేరకు డార్క్‌ స్పాట్‌లను గుర్తించారు. అత్యధికంగా చార్మినార్‌లో 3,827, ఎల్‌బీనగర్‌ జోన్‌లో 3,743, సికింద్రాబాద్‌లో 2,665, కూకట్‌పల్లి 1,403, ఖైరతాబాద్‌లో 1,358, శేరిలింగంపల్లిలో 1,312 డార్క్‌ స్పాట్‌లలో వీధి దీపాలు ఏర్పాటు చేసినట్టు సంస్థ పేర్కొంది. లైట్లు ఏర్పాటు చేస్తోన్న సంస్థ అవి వెలుగుతున్నాయా..? లేదా..? అన్నది పట్టించుకోవడం లేదు.

Updated Date - 2021-11-26T20:14:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising