ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగదాంబికా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు

ABN, First Publish Date - 2021-07-11T19:02:05+05:30

ల్కొండ జగదాంబికా అమ్మవారి బోనాల జాతర ఘనంగా జరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: గోల్కొండ జగదాంబికా అమ్మవారి బోనాల జాతర ఘనంగా జరుగుతోంది. లంగర్‌‌హౌప్‌ నుంచి ప్రారంభమైన తొట్టెల ఊరేగింపులో మంత్రులు తలసాని, ఇంద్రకరణ్‌ పాల్గొన్నారు. అనంతరం గోల్కొండ జగదాంబికా అమ్మవారికి మంత్రులు పట్టువస్త్రాలు సమర్పించారు. తొట్టెల ఊరేగింపులో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పోతురాజుల విన్యాసాలు, డప్పుల దరువుతో గోల్కొండ పరిసరప్రాంతాలు సందడిగా మారాయి. 


ఈ సందర్భంగా మంత్రులు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని.. వర్షం కురవడం కూడా శుభసూచికమని మంత్రి తలసాని అన్నారు. నగరంలోని అన్ని ఆలయాలకు నిధులు మంజూరు చేశామని చెప్పారు. కరోనాతో గతేడాది పండుగకు దూరం అయ్యామని తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూ అందరూ మాస్కులు ధరించాలని... సానీటైజర్ వాడాలని, ప్రజలు సహకరించాలి మంత్రి తలసాని కోరారు.  భాగ్యనగర బోనాల కోసం అందరు ఎదురుచూస్తుంటారని మరో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలనే... అన్ని ఆలయాలకు నిధులు మంజూరు చేశామని తెలిపారు. అందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. అమ్మవారి దయతో మంచిగా వర్షాలు కురిసి... ప్రాజెక్టులు నిండాలని ఆశిస్తున్నానని మంత్రి ఇంద్రకరణ్ అన్నారు. 

Updated Date - 2021-07-11T19:02:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising