ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోల్కొండ ఖిల్లా స్వచ్ఛతలో ఇలా

ABN, First Publish Date - 2021-02-27T06:36:23+05:30

కొవిడ్‌ లాక్‌డౌన్‌ సడలింపుల అనంతరం గోల్కొండ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలంగాణ వారసత్వ సంపదకు ఆలవాలం గోల్కొండ కోట. కొన్ని శతాబ్దాల చరితకు సాక్షీభూతమైన ఆ కోట స్వచ్ఛ పర్యాటక గమ్యస్థానాల (స్వచ్ఛ టూరిస్ట్‌ డెన్టినేషన్‌) జాబితాలోకెక్కింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పన్నెండు స్వచ్ఛ ఐకాన్‌ స్థలాల్లో గోల్కొండ ఉండటం పట్ల చరిత్ర అధ్యయనకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తద్వారా కోట పరిసరాల్లో పారిశుధ్యం, పరిశుభ్రతకు మరిన్ని చర్యలు తీసుకోవడం ద్వారా సందర్శకులనూ మరింత ఆకట్టుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు.


లంగర్‌హౌస్‌ : కొవిడ్‌ లాక్‌డౌన్‌ సడలింపుల అనంతరం గోల్కొండ కోటలోకి పర్యాటకులను అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. ఏయేటికాయేడు కోటలో సందర్శకుల తాకిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దేశంలోని పన్నెండు స్వచ్ఛ ఐకాన్‌ స్థలాల్లో గోల్కొండ ఎంపిక కావడం విశేషం. తద్వారా కోటలోని పారిశుధ్యం, పరిశుభ్రత మెరుగుపరిచేందుకు మరిన్ని చర్యలు చేపట్టనున్నారు. దాంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులకు అనుకూలంగా మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా పర్యాటకంగా మరింత ముందుకెళుతుందని చరిత్ర అధ్యయనకారులు అభిప్రాయపడుతున్నారు. కోట ప్రాంగణంలో మౌలిక సదుపాయాల కల్పన పేరుతో చేపట్టే నిర్మాణాలను వారసత్వ కట్టడాల నియమ, నిబంధనల మేరకు జరగాలని వారంతా కోరుతున్నారు. కొద్దిరోజుల కిందట జగదాంబిక ఆలయం వెనుక భాగంలో మరుగుదొడ్లు నిర్మించారు. వాటితోపాటూ నగీనా బాగ్‌ ఆవరణలోనూ టాయిలెట్ల నిర్మించారు. దాదాపు యాభై ఏళ్ల క్రితం ఆ ప్రదేశంలో ఉన్న మరుగుదొడ్లను కూల్చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో టాయిలెట్లు నిర్మించారు. సందర్శకులకు సదుపాయాల కల్పన మంచిదే కానీ, ఆ పేరుతో చారిత్రక నిర్మాణాల సముదాయంలో ఇష్టానుసారంగా కాంక్రీటు నిర్మాణాలు చేపట్టడం వల్ల చారిత్రక కట్టడం రూపురేఖలకు చేటు వాటిల్లే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. 


స్వచ్ఛతపై శ్రద్ధ పెరిగింది

నలభై ఏళ్లుగా గోల్కొండ కోటలో గైడ్‌గా పనిచేస్తున్నాను. కోట పరిసరాలను శుభ్రంగా ఉంచడంతో పాటు, పర్యాటకుల్లోనూ పరిశుభ్రతపై సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. దాంతో పాటు చెత్త,చెదారం ఎక్కడపడితే అక్కడేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మూడేళ్లలో పారిశుధ్యం విషయంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. 

- మహమ్మద్‌ గఫూర్‌, గైడ్‌, గోల్కొండ. 


ప్రత్యేక నిఘాతో స్వచ్ఛత

గోల్కొండ కోట పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. దాంతో పాటూ ప్రత్యేక నిఘానూ ఏర్పాటుచేశాం. తద్వారా ఎప్పటికప్పుడు కోట పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు సిబ్బందిని, సందర్శకులనూ అప్రమత్తం చేస్తున్నాం. కోట లోపల ఎక్కడిక్కడ చెత్తబుట్టలను ఏర్పాటు చేశాం. హోటళ్లు, కేఫ్‌టేరియన్ల వద్ద చెత్త, చెదా రం పోగవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. 

 - నవీన్‌కుమార్‌, పర్యవేక్షణ అధికారి,


అవగాహన కల్పించాలి

కోటలోని నిర్మాణాల సముదాయం చూసేందుకు రెండు కళ్లూ చాలవన్నం త అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా బాలసాహిర్‌, నగీనా బాగ్‌ నిర్మాణాలు బాగా నచ్చాయి. గోల్కొండ చరిత్రను మరింత తెలుసుకోవాలనుకుంటున్నా. కోట పరిసరాలను చాలా వరకూ శుభ్రం గా ఉంచారు. కొందరు ఖాళీ నీళ్ల బాటిళ్లు, తినుబండారాల కవర్లు పడేస్తున్నారు. దీనిపై పర్యాటకుల్లో మరింత అవగాహన కల్పించాలి. టాయిలెట్స్‌ సంఖ్యను పెంచాలి. వా టిని శుభ్రతగా మెయింటెన్‌ చేస్తే బావుంటుంది. 

- ప్రశాంత్‌, పర్యాటకుడు, ఛత్తీసగఢ్‌

Updated Date - 2021-02-27T06:36:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising