ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒకే రోజు 109 డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు

ABN, First Publish Date - 2021-02-27T05:28:56+05:30

రాచకొండ పరిధిలో శుక్రవారం ఒకే రోజు 109 డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు నమోదయ్యాయని ట్రాఫిక్‌ అదనపు డీసీపీ మనోహర్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- 30మందికి స్వల్ప జైలు శిక్ష

- జరిమానా రూ.2,53,900 

కొత్తపేట, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): రాచకొండ పరిధిలో శుక్రవారం ఒకే రోజు 109 డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు నమోదయ్యాయని ట్రాఫిక్‌ అదనపు డీసీపీ మనోహర్‌ తెలిపారు. ఆరు పోలీస్‌ స్టేషన్ల పరిధిలో కేసుల వివరాలు వెల్లడించారు. భువనగిరి, చౌటుప్పల్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధుల్లో డీడీ కేసులు నమోదు కాలేదని, మిగతా 6 ట్రాఫిక్‌ పీఎ్‌సల పరిధిలో డీడీ తనిఖీల్లో పట్టుబడిన 109 మందిలో  కోర్టులు 30మందికి జరిమానా సహా స్వల్ప(ఒక రోజు నుంచి 11 రోజులు) జైలు శిక్ష విధించాయని తెలిపారు. పట్ట్టుబడిన 109 మంది రూ.2,53,900 జరిమానా చెల్లించారని తెలిపారు. యాదాద్రి పరిధిలో అత్యధికంగా 32 డీడీ కేసులు నమోదయ్యాయని, వనస్థలిపురం, ఎల్‌బీనగర్‌ ట్రాఫిక్‌ పీఎస్‌ పరిధిలో అత్యల్పంగా 14కేసులు చొప్పున నమోదు కాగా, కుషాయిగూడలో 19, మల్కాజిగిరి, ఉప్పల్‌ పీఎస్‌లలో 15 కేసులు చొప్పున నమోదయ్యాయని పేర్కొన్నారు. డీడీ తనిఖీల్లో పట్టుబడిన 109 మందిలో 78 మందికి జరిమానా మాత్రమే విధించారని, 30 మంది మందు బాబులకు జరిమానాతో సహా జైలు శిక్ష, ఒకరికి జరిమానా సహా కమ్యూనిటీ సర్వీస్‌ విధించారని తెలిపారు. 


Updated Date - 2021-02-27T05:28:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising