ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డాక్టర్ ఆనంద్‌కు సేవా భారత్ అవార్డ్

ABN, First Publish Date - 2021-04-18T22:26:55+05:30

గత కొన్నేళ్లుగా సామాజిక కార్యకర్తగా అత్యంత విలువైన సేవలు అందిస్తున్న డాక్టర్ ఆనంద్‌ను ‘సేవా భారత్’ అవార్డు వరించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: గత కొన్నేళ్లుగా సామాజిక కార్యకర్తగా అత్యంత విలువైన సేవలు అందిస్తున్న డాక్టర్ ఆనంద్‌ను ‘సేవా భారత్’ అవార్డు వరించింది. తన బంజారా మహిళా యన్‌జీ‌వో తరపున నిర్విరామంగా పేదలు, వృద్ధులు, అనాథలు, వలస కూలీల కోసం విభిన్న కార్యక్రమాలు చేపడుతున్న కారణంగా.. ఈ అవార్డు అందించారు. లాక్‌డౌన్ సమయంలో వలస కూలీలు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు నిత్యావసర వస్తువుల పంపిణీ చేయడం, అన్నదానాలు నిర్వహించండం, కోవిడ్ కిట్‌ల పంపిణీ తదితర కార్యక్రమాలను డాక్టర్ ఆనంద్ నిర్వహించారు. ఎన్నో వేల మందికి అండగా నిలిచిన ఆనంద్ సేవలను గుర్తించి ‘సేవా భారత్’ కోవిడ్ వారియర్ అవార్డును ప్రకటించారు. హోం క్వారంటైన్‌లో ఉన్న ఆనంద్ తరపున ప్రశాంత్ ఈ అవార్డును అందుకున్నారు.  తమ సేవలను గుర్తించిన యాజమాన్యానికి, తన మిత్రులకు డాక్టర్ ఆనంద్ ధన్య వాదాలు తెలియజేశారు. రవీంద్ర భారతిలో శనివారం జరిగిన అవార్డుల కార్యక్రమానికి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మి నారాయణ, హెవెన్ హోమ్స్ వరలక్ష్మి హాజరయ్యారు. 

Updated Date - 2021-04-18T22:26:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising