ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షార్ట్ సర్క్యూట్ వల్లే గాంధీలో అగ్నిప్రమాదం: DME

ABN, First Publish Date - 2021-10-20T17:32:07+05:30

షార్ట్ సర్క్యూట్ అవ్వటంతో గాంధీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగిందని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్(డీఎంఈ)రమేష్ రెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: షార్ట్ సర్క్యూట్ అవ్వటంతో గాంధీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగిందని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్(డీఎంఈ)రమేష్ రెడ్డి  తెలిపారు. బుధవారం  గాంధీ అగ్నిప్రమాద ఘటనా స్థలాన్ని డీఎంఈ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గాంధీలోనే ప్రత్యేకంగా అగ్నిమాపక సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చి 15 నిమిషాల్లో మంటలను అదుపులోకి తెచ్చారని అన్నారు. ఎవ్వరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని.. పరికరాలు పాడవ్వలేదని చెప్పారు. 120 పేషేంట్లను పక్క వార్డులోకి తరలించామన్నారు. 2 రోజుల్లో అంత క్లియర్ చేస్తామని ఆయన తెలిపారు. ఎలక్ట్రికల్ వాళ్లకు పక్క వార్డులలో కూడా ఉన్న బోర్డులను చెక్ చెయ్యమని చెప్పామన్నారు. అన్ని ఆస్పత్రులలో ఫైర్ సిబ్బంది ఉండేలా చూస్తామని తెలిపారు. పెద్ద ఆస్పత్రి కాబట్టి ఒక స్టేషన్ పెట్టామని...భారత దేశంలోనే గాంధీలో ఫైర్ స్టేషన్ ఉందని అన్నారు. మొదట్లో డాక్టర్లకు మాక్ డ్రిల్ నిర్వహించామని.. మళ్ళి ఒకసారి మాక్ డ్రిల్‌ని నిర్వహించి అవగాహన కల్పిస్తామని చెప్పారు. అన్ని ఆస్పత్రులలో ఇప్పటికే డాక్టర్లకు మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ బ్లాక్‌లో లిమిటెడ్ పేషేంట్లు చాలా తక్కువగా ఉన్నారని రమేష్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-20T17:32:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising