ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దివాలా చట్టాన్ని రద్దు చేయాలి : వేణుగోపాల్‌స్వామి

ABN, First Publish Date - 2021-03-03T06:41:44+05:30

దేశంలో ఖాయిలాపడ్డ పరిశ్రమలను ఆదుకోవడంతోపాటు విక్రయించేందుకు తీసుకొచ్చిన దివాలా చట్టాన్ని రద్దు చేయాలని ఆలిండియా ప్రొఫెషనల్‌ కాంగ్రెస్‌(ఏఐపీసీ) సభ్యుడు వేణుగోపాల్‌స్వామి డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పంజాగుట్ట, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): దేశంలో ఖాయిలాపడ్డ పరిశ్రమలను ఆదుకోవడంతోపాటు విక్రయించేందుకు తీసుకొచ్చిన దివాలా చట్టాన్ని రద్దు చేయాలని ఆలిండియా ప్రొఫెషనల్‌ కాంగ్రెస్‌(ఏఐపీసీ) సభ్యుడు వేణుగోపాల్‌స్వామి డిమాండ్‌ చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం దుర్వినియోగంతో దేశానికి ఇప్పటి వరకు సుమారు రూ. 10 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని ఆరోపించారు.  ఇప్పటి వరకు నాలుగు వేల కంపెనీలు మూతపడ్డాయన్నారు. అంబానీ, ఆదానిలతో పాటు బీజేపీ కనుసన్నల్లో నడిచే సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకు కేంద్రం ఈ చట్టాన్ని వాడుకుంటుందన్నారు. అంబానీ కోసం ప్రత్యేక ఆర్డినెన్స్‌ తీసుకొచ్చారన్నారు. ఈ చట్టం దుర్వినియోగం అవుతున్న తీరును దేశ ప్రజలకు వివరించి రద్దు చేసే వరకు పోరాడతానని ఆయన తెలిపారు. చట్టం ఎలా దుర్వినియోగం అవుతుందో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు మెయిల్‌ ద్వారా లేఖ పంపించానని, ఆమె సమయం ఇస్తే వివరించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. సమావేశంలో ఏఐపీసీ తెలంగాణ విభాగం ఉపాధ్యక్షుడు సంతో్‌షకుమార్‌, ఆనంద్‌, శ్రీలత పాల్గొన్నారు.


Updated Date - 2021-03-03T06:41:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising