ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్ని ప్రధాన రహదారులను విస్తరించడానికి చర్యలు: సబితారెడ్డి

ABN, First Publish Date - 2021-08-04T06:52:08+05:30

బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌లోని అన్ని ప్రధాన రహదారులను భవిష్యత్‌ అవసరాల మేరకు విస్తరించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి పి.సబితారెడ్డి తెలిపారు.

రోడ్డు విస్తరణ పనులు ప్రారంభిస్తున్న మంత్రి సబితారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సరూర్‌నగర్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌లోని అన్ని ప్రధాన రహదారులను భవిష్యత్‌ అవసరాల మేరకు విస్తరించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి పి.సబితారెడ్డి తెలిపారు. అల్మా్‌సగూడ-గుర్రంగూడ రోడ్డులో ఒకట్నిర కిలో మీటర్ల మేర రూ.1.60 కోట్లతో చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులకు మేయర్‌ చిగిరింత పారిజాతానర్సింహారెడ్డి, కార్పొరేటర్లు ఏనుగు రాం రెడ్డి, ముత్యాల లలితాకృష్ణ, సంరెడ్డి స్వప్నావెంకట్‌రెడ్డి, రామిడి కవితారాంరెడ్డిలతో కలిసి మంత్రి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఎంఆర్‌ఆర్‌ కాలనీలో రూ.15లక్షలతో, రాజీవ్‌ గృహకల్పలో రూ.17లక్షలతో నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థను, రాజీవ్‌ గృహకల్పలో రూ.40లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును మంత్రి ప్రారంభించారు. విశాఖనగర్‌లో రూ.30లక్షల తో, వెంకటేశ్వరకాలనీలో రూ.15 లక్షలతో, రాజీ వ్‌ గృహకల్పలో రూ.10 లక్షలతో చేపట్టనున్న యూజీడీ పనులకు శంకుస్థాపన చేశారు. 

పార్కు స్థలం కబ్జాపై ఫిర్యాదు

అల్మా్‌సగూడ శ్రీహిల్స్‌ కాలనీలో పార్కు స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని, వాటిని కాపాడి పార్కుతో పాటు ఓపెన్‌ జిమ్‌ వంటివి ఏర్పాటు చేయాలని కాలనీ ప్రతినిధి బహుగుణ మంత్రి సబితారెడ్డికి విజ్ఞప్తి చేశారు. మంత్రి స్పందిస్తూ కాలనీల్లోని అన్ని పార్కు స్థలాలను కాపాడతామని, కబ్జాదారులు ఎంతటి వారైనా వదిలేదని లేదన్నారు. కార్యక్రమంలో కమిషనర్‌ టి.కృష్ణమోహన్‌రెడ్డి, కార్పొరేటర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-04T06:52:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising