ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నయీమ్ కేసులో దర్యాప్తు ఏమైంది? : శ్రవణ్ దాసోజు

ABN, First Publish Date - 2021-08-08T23:39:09+05:30

హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్‌కౌంటర్ జరిగి ఐదేళ్లు పూర్తవుతున్నా.. నేటికీ పూర్తి స్థాయి దర్యాప్తు ఎందుకు జరగలేదని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్‌కౌంటర్ జరిగి ఐదేళ్లు పూర్తవుతున్నా.. నేటికీ పూర్తి స్థాయి దర్యాప్తు ఎందుకు జరగలేదని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు ప్రశ్నించారు. ఆదివారం ఆయన  మీడియాతో మాట్లాడుతూ నయీమ్ బ్లూ డైరీ, స్వాధీనం చేస్తున్న వేల ఎకరాల భూములు, వేల కోట్ల రూపాయలు, సిట్ దర్యాప్తు చేసిన వివరాలను ప్రభుత్వం ఎందుకు ప్రజల ముందు పెట్టలేదన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులపై ఆరోపణలు ఉన్నా.. కేసులు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. చిన్న స్థాయి పోలీసు అధికారులపై చర్యలు మినహా చేసిందేమీ లేదన్నారు. ఐదేళ్లవుతున్నా పూర్తి స్థాయి చార్జిషీట్లు నమోదు చేయలేదని ఆరోపించారు. నయీమ్ బాధితుల్లో ప్రభుత్వం.. ఎంతమందికి న్యాయం చేసిందో చెప్పాలన్నారు. సీబీఐ ఎంక్వయిరీ వేయాలన్న.. ప్రతిపక్షాల డిమాండ్లను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు గతంలో గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో అంటకాగినందుకే.. కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి.. సిట్‌ రిపోర్ట్, నయీమ్ బ్లూ డైరీని బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

Updated Date - 2021-08-08T23:39:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising