ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వామ్మో.. Hyderabad లో ఇన్ని మోసాలా.. రెచ్చిపోతున్న సైబర్‌ నేరగాళ్లు..!!

ABN, First Publish Date - 2021-08-31T13:26:47+05:30

నమ్మకం పెరిగన అతడు రూ. 1.46లక్షలు బదిలీ చేశాడు. తర్వాత...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ : ఆన్‌లైన్‌లో పెట్టుబడి పెడితే తక్కువ సమయంలోనే అధిక మొత్తం లాభాలు వస్తాయని నమ్మించిన సైబర్‌ నేరగాళ్లు ఓ వ్యక్తి నుంచి రూ. 1.46 లక్షలు కాజేశారు. బంజారాహిల్స్‌కు చెందిన బలరాముడు అనే కార్‌డ్రైవర్‌కు ఆన్‌లైన్‌లో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ఆన్‌లైన్‌లో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని నమ్మించాడు. ముందుగా కొద్ది మొత్తాలకు లాభాలు ఆశచూపారు. నమ్మకం పెరిగన అతడు రూ. 1.46లక్షలు బదిలీ చేశాడు. తర్వాత ఫోన్‌ స్విచ్ఛాప్‌ రావడంతో మోసపోయానని గ్రహించి సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడు.


లింక్‌ పంపి రూ. 4. 71 లక్షలు

ఆన్‌లైన్‌లో పెట్టుబడి పెట్టాలని కోరిన సైబర్‌ నేరగాళ్లు ఓ వ్యక్తికి లింక్‌ పంపారు. వారి మీద నమ్మకంతో అతడు లింక్‌‌ను క్లిక్‌ చేశాడు. ఫోన్‌లో బ్యాంకు వివరాలు తెలుసుకున్న సైబర్‌ నేరగాళ్లు.. అతడితో మాట్లాడి ఓటీపీ చెప్పాలని కోరారు. వారు చెప్పిన విధంగానే నాలుగు పర్యాయాలు ఓటీపీ చెప్పడంతో అతడి ఖాతా నుంచి రూ. 4.71 లక్షలు కాజేశారు.


ఇల్లు కొంటామంటూ రూ. 3.87 మోసం

ఓఎల్‌ఎక్స్‌లో ఇల్లు అమ్మకానికి పెట్టిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిని మోసం చేసిన సైబర్‌ నేరగాళ్లు అతడి వద్ద నుంచి రూ. 3.87 లక్షలు కాజేశారు. కొనుగోలుదారుల్లా మాట్లాడిన సైబర్‌ నేరగాళ్లు పలు ఖాతాల ద్వారా డబ్బులు పంపుతామని.. బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకున్నారు. ఆ తర్వాత లింక్‌ పంపి తెరవాలని కోరారు. పలు దఫాలుగా 4 బ్యాంకు ఖాతాల నుంచి రూ. 3.87 లక్షలు కాజేశారు.


యువతికి వేదింపులు

నగ్న చిత్రాలను పోర్న్‌ సైట్లలో అప్‌లోడ్‌ చేస్తానంటూ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌లో బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఓ యువతి సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించింది.


పోయిన కార్డు నుంచి రూ. 3లక్షలు మాయం

తార్నాకకు చెందిన సదాసివరెడ్డి అనే వ్యక్తి డెబిట్‌ కార్డు పోయింది. ఈ విషయాన్ని అతడు పట్టించుకోలేదు. కానీ రెండు రోజుల క్రితం అతడి ఖాతా నుంచి రూ. 3 లక్షలు మాయం అయ్యాయని తెలుసుకొని.. సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడు.

Updated Date - 2021-08-31T13:26:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising