ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలి: somesh kumar

ABN, First Publish Date - 2021-08-25T17:00:12+05:30

ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు. బుధవారం ఉప్పుగుడ పరిధిలోని పరివార్ కాలనీలో నిర్వహిస్తున్న కొవిడ్ వ్యాక్సినేషన్  కార్యక్రమాన్ని సీఎస్ పరిశీలించారు. ఈ సందర్భంగా సోమేష్ కుమార్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో 100శాతం అర్హులైన వారికి చేపట్టిన కొవిడ్ వ్యాక్సిన్  కార్యక్రమం విజయవంతంగా నడుస్తోందన్నారు. ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారని తెలిపారు. పదిరోజుల పాటు ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుందని.. అవసరమైతే పొడగిస్తామని చెప్పారు. దేశంలోని ఏ మెట్రో నగరాల్లో ఇంత పెద్ద స్థాయిలో మెగా వ్యాక్సినేషన్  ప్రోగ్రాం నిర్వహించలేదన్నారు. ఇళ్లలో ఇంకా మిగిలిన వారికే ఈ ప్రత్యేక వ్యాక్సిన్ కార్యక్రమాన్ని హైదరాబాద్ నగరంలో చేపట్టామని సోమేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-25T17:00:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising