దొంగతనం చేసి.. నగల మూటతో ఆలయంలోనే నిద్ర
ABN, First Publish Date - 2021-07-26T06:09:19+05:30
ఓ ఆలయంలోకి చొరబడ్డ
మదీన, జూలై 25 (ఆంధ్రజ్యోతి) : ఓ ఆలయంలోకి చొరబడ్డ యువకుడు ఎత్తుకుపోవడానికి అమ్మవారి నగలు, వస్తువులను మూట గట్టాడు. ఇంతలో మైకం కమ్మడంతో ఆలయంలోనే నిద్రపోయాడు. వివరాలు ఇలా ఉన్నాయి. చాంద్రాయణగుట్ట శ్రీ రామాలయం ఆవరణలో సాయిబాబా గుడి కూడా ఉంది. ఈ గుడి వెనుక వైపు నుంచి ఓ యువకుడు (16) లోనికి ప్రవేశించాడు. అమ్మవారి నగలు, వస్ర్తాలు, ఇతర వస్తువులను మూటగట్టుకున్నాడు. ఏమైందో ఏమో ఆలయంలోనే పడికునిపోయాడు. ఉదయం వచ్చిన ఆలయ నిర్వాహకులు అతడిని పట్టుకుని నిలదీయగా అమ్మవారి వస్తువులు మూటగట్టుకున్న తర్వాత తనను ఎవరో పట్టుకుని లాగినట్లు అనిపించిందంటూ పొంతనలేని సమాధానాలు చెప్పడం గమనార్హం.
Updated Date - 2021-07-26T06:09:19+05:30 IST