ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రేమోన్మాది అరెస్టు

ABN, First Publish Date - 2021-03-04T06:17:14+05:30

అప్పటికే అతనికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెండో పెళ్లికి పథకం 

కుదరకపోవడంతో దాడి


నార్సింగ్‌ మార్చి3 (ఆంధ్రజ్యోతి): అప్పటికే అతనికి పెళ్లి  అయింది. భార్యతో పాటు పాప ఉంది. వారంతా హరియాణాలోని సొంత గ్రామంలో ఉంటున్నారు. తాను హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నందున ఇక్కడ ఒక ఫ్యామిలీని సెట్‌  చేయాలనుకున్నాడు. పథకం రచించి ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు. పథకం బెడిసి కొట్టడంతో ఆమెను అంతమొందించాలి అనుకున్నాడు. నార్సింగ్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో మంగళవారం రాత్రి జరిగిన ప్రేమోన్మాది దాడి తర్వాత పలు విషయాలు వెలుగుచూశాయి.  బతుకు దెరువు కోసం నగరానికి వచ్చిన షారుక్‌ సల్మాన్‌ (27) సన్‌సిటీలోని ఓ బ్యూటీ పార్లర్‌లో పని చేస్తున్నాడు.  కస్టమర్‌గా వచ్చిన యువతి (29)తో అతనికి పరిచయం ఏర్పడింది. రెండేళ్ల పరిచయంలో అతడికి అప్పటికే పెళ్లి జరిగిందని తెలుసుకున్న ఆ యువతి కొంత కాలంగా సల్మాన్‌ను దూరం పెడుతూ వస్తోంది. గతేడాది మేలో ఆమెకు పెళ్లి నిశ్చయం కావడంతో మరింత దూరం పెంచింది. అది తట్టుకోలేకపోయిన సల్మాన్‌ ఆమెను చంపేయాలని భావించి మంగళవారం దాడికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. సల్మాన్‌ను నార్సింగ్‌ పోలీసులు బుధవారం రిమాండ్‌కు తరలించారు. 

పరామర్శించిన ఎమ్మెల్యే

యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతిని ఎమ్మెల్యే టి. ప్రకాష్‌గౌడ్‌ పరామర్శించారు. అనంతరం ప్రకాష్‌గౌడ్‌ మాట్లాడుతూ నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామన్నారు. బాధితురాలి చికిత్సకు అయ్యే ఖర్చును సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి ఇప్పిస్తామని తెలిపారు.

Updated Date - 2021-03-04T06:17:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising