ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అయిన వాళ్లే..!

ABN, First Publish Date - 2021-03-03T07:17:30+05:30

బంధాలు మరచి సొంత వారే తమ వారిని కడతేరుస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బంధాలు మరచి సొంత వారే తమ వారిని కడతేరుస్తున్నారు. ముక్కుపచ్చలారని మూడేళ్ల చిన్నారిని పిన్ని భవనంపై నుంచి  విసిరి పడేసింది. దీంతో ఆ బాబు అక్కడికక్కడే చనిపోయాడు. మత్తులో భర్తను చంపేసిందో ఇల్లాలు. తన అన్నను భార్యాపిల్లలే చంపేసి గుండెపోటు అంటున్నారని  ఓ చెల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.


సంతానం కలగడం లేదని..

మూడేళ్ల చిన్నారి పై పిన్ని పైశాచికం 

భవనంపై నుంచి తోసి హత్య 

హైదరాాబాద్/చార్మినార్ (ఆంధ్రజ్యోతి): వివాహం జరిగి 16 నెలలైనా సంతానం కలగకపోవడంతో మానవత్వాన్ని మరచిన ఓ మహిళ బావ (భర్త సోదరుడు) కుమారుడిని రెం డో అంతస్తుపై నుంచి విసిరేసింది. తీవ్ర గాయాలైన చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన భవానీనగర్‌ పీఎస్‌ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ వెంకటేష్‌ కథనం ప్రకారం.. ఈదీబజార్‌ కుమ్మర్‌వాడీకి చెందిన మహ్మద్‌ ఏత్తెషాముద్దీన్‌, మమ్మద్‌ సుజావుద్దీన్‌ సోదరుడు. సుజావుద్దీన్‌కు అయేషాబాను (21)తో 2019 నవంబర్‌లో వివాహం జరిగింది. ఇప్పటి వరకు సంతా నం కలగకపోవడంతో తరుచూ భర్తతో గొడవ పడేది. తనకు పిల్లలు లేరని, ఎవరికీ పిల్లలు ఉండకూడదని ఇంట్లో కరెంట్‌ తీగల ను బయటకు తీసింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వాటిని సరిచేయించి, అయేషానుబానును పుట్టింటికి పంపించారు. కొన్ని రోజుల తర్వాత అందరూ సర్దిచెప్పడంతో అయేషా బాను భర్త దగ్గరకు వచ్చింది. మంగళవారం ఎత్తెషాముద్దీన్‌ కుమారుడు నుమానుద్దీన్‌(3)ను మాయమాటలతో రెండో అంతస్తుపైకి తీసుకెళ్లి, అక్కడి నుంచి ఆ చిన్నారిని కిందికి పడేసింది. చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు, కుటుంబసభ్యులు గాయపడిన బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. తలకు తీవ్రగాయం కావడంతో మార్గమధ్యంలోనే చనిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-03-03T07:17:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising