ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిరాజ్‌ ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

ABN, First Publish Date - 2021-01-21T06:51:55+05:30

ఆస్ట్రేలియాతో ముగిసిన బోర్డర్‌-గవాస్కర్‌ టెస్టు సిరీ్‌సలో అంచనాలకు మించి రాణించిన హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ను మాజీ ఎంపీ వి.హనుమంతరావు ప్రశంసించారు.

విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న వీహెచ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎంపీ వీహెచ్‌


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఆస్ట్రేలియాతో ముగిసిన బోర్డర్‌-గవాస్కర్‌ టెస్టు సిరీ్‌సలో అంచనాలకు మించి రాణించిన హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ను మాజీ ఎంపీ వి.హనుమంతరావు ప్రశంసించారు. ఫతేమైదాన్‌ క్లబ్‌లో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ సిరాజ్‌ నగరానికి చేరుకున్నాక అతణ్ణి ఘనంగా సన్మానించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఈ సన్మానాన్ని సిరాజ్‌ అంగీకరించాలని.. అతడి వెసులుబాటు చూసుకుని వచ్చే శని, ఆదివారాల్లో సన్మానానికి సమయం ఇవ్వాలని వీహెచ్‌ కోరారు. ‘తండ్రి మరణ వార్తను తట్టుకుని టెస్టు సిరీ్‌సలో అతడు 13 వికెట్లు తీయడం ఆషామాషీ కాదు. నేను నిర్వహించిన రాజీవ్‌గాంధీ అండర్‌-19 క్రికెట్‌ టోర్నమెంట్‌లో కూడా అతడు గతంలో చక్కగా ఆడాడు. కెరీర్‌లో సిరాజ్‌ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నా’ అని వీహెచ్‌ అన్నారు.


Updated Date - 2021-01-21T06:51:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising