ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్ కొనుగోళ్లలో ఎంత ఆదా చేశారో చెప్పాలి: Ramakrishna

ABN, First Publish Date - 2021-10-11T14:16:50+05:30

విద్యుత్ కొనుగోళ్లలో ఎంత ఆదా చేశారో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: విద్యుత్ కొనుగోళ్లలో ఎంత ఆదా చేశారో జగన్మోహన్ రెడ్డి  సమాధానం చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. విద్యుత్ కొనుగోళ్లలో ఆదా చేసినప్పుడు పదేపదే ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 28 మాసాల కాలంలో దాదాపు రూ.9 వేల కోట్ల మేర విద్యుత్ చార్జీల భారాన్ని ప్రజలపై మోపిందని ఆయన మండిపడ్డారు. విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో మరో రూ.3699 కోట్ల గుదిబండ ప్రజలపై వేసిందన్నారు. బొగ్గు నిల్వలు లేకపోవటంవల్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేయలేకపోతున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని.. కాని 24 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దోబూచులాటలు కట్టిపెట్టాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి పెంచి బొగ్గు సరఫరా అయ్యే విధంగా చూడాలని రామకృష్ణ పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-11T14:16:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising