ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రాన్స్‌జెండర్లకు కరోనా టీకాలు

ABN, First Publish Date - 2021-06-18T15:58:52+05:30

ట్రాన్స్‌జెండర్లు కరోనా కాలంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని మోన్‌ఫోర్టు సోషల్‌ ఇనిస్టిట్యూట్‌ సంస్థ ప్రతినిధి బ్రదర్‌ వర్గీస్‌ ఆవేదన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ట్రాన్స్‌జెండర్లకు మోన్‌ఫోర్ట్‌ సోషల్‌ ఇనిస్టిట్యూట్‌ సాయం 

హైదరాబాద్‌ సిటీ: ట్రాన్స్‌జెండర్లు కరోనా కాలంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని మోన్‌ఫోర్టు సోషల్‌ ఇనిస్టిట్యూట్‌ సంస్థ ప్రతినిధి బ్రదర్‌ వర్గీస్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కష్టసమయంలో ట్రాన్స్‌ కమ్యూనిటీలో పేదరికంతో మగ్గుతున్న వారందరికీ నిత్యావసర సరుకులను పంచుతున్నట్లు తెలిపారు.  మోన్‌ఫోర్టు సోషల్‌ ఇనిస్టిట్యూట్‌ సోదర సంస్థ సెయింట్‌ గేబ్రియేల్‌ అండ్‌ ట్రాన్స్‌ ఈక్వాలిటీ సొసైటీ సంయుక్తంగా హైదరాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లోని ట్రాన్స్‌జెండర్లకు పాతనగరంలోని సిటీకాలేజీ ప్రాంగణంలో రెండురోజుల పాటు కరోనా టీకా కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా టీకా తీసుకొనేందుకు ముందుకొచ్చిన ట్రాన్స్‌ మహిళ శుభాగతాను అధికారులు అభినందించారు. తెలంగాణ స్త్రీ, శిశు సంక్షేమ శాఖతో కలిసి ట్రాన్స్‌ ఈక్వాలిటీ సొసైటీ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ట్రాన్స్‌జెండర్ల కోసం ఉచిత టీకా శిబిరాలను నిర్వహించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.  ట్రాన్స్‌జెండర్లకు వైద్యసహాయంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాల్సిందిగా ట్రాన్స్‌జెండర్‌ ముకుంద మాల కోరారు. 

Updated Date - 2021-06-18T15:58:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising