ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ ప్రారంభం

ABN, First Publish Date - 2021-05-05T17:19:52+05:30

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. డీజీపీ మహేందర్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు విచారణకు హాజరయ్యారు. రాష్ట్రంలో టెస్టులు సంఖ్య తగ్గించి కేసులు తగ్గాయని ఎలా చెపుతారని...టెస్టులు ఎందుకు పెంచడం లేదని న్యాయస్థానం అధికారులను ప్రశ్నించింది. కాగా... రాష్ట్రంలో కావాల్సిన టెస్టులు చేస్తున్నామని హెల్త్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు కోర్టుకు విన్నించారు. అయితే  ఒక్క రోజు కూడా లక్ష టెస్టులు దాటలేదని...నైట్ కర్ఫ్యూ పెట్టి ప్రభుత్వం చేతులు దులుపుకొందని ఆక్షేపించింది. నైట్ కర్ఫ్యూ పెట్టినా కేసులు ఎందుకు పెరుగుతున్నాయని ప్రశ్నించింది. లాక్‌డౌన్ దిశగా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు అడిగింది. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో బెడ్స్, ఆక్సిజన్ డేటా సమర్పించాలని ధర్మాసనం కోరింది. తెలంగాణ రాష్ట్రంలో ఆక్సిజన్ ఎంత డిమాండ్ ఉందని  హైకోర్టు ప్రశ్నించగా... 600 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను డిమాండ్ ఉందని శ్రీనివాస్ రావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 430 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఇచ్చిందని హైకోర్టుకు చెప్పారు. ఇప్పటికే పలు కర్ణాటక, ఒరిస్సా నుండి ఆక్సిజన్ తెచ్చామన్నారు. తమిళనాడు నుండి రావాల్సిన 55 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రాలేదని శ్రీనివాస్ రావు కోర్టుకు తెలియజేశారు. ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. 

Updated Date - 2021-05-05T17:19:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising