ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాక్సిన్‌ కోసం పోటెత్తిన జనం

ABN, First Publish Date - 2021-05-09T06:15:33+05:30

కొవిడ్‌ రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌ కోసం బాలానగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద జనం శనివారం పోటెత్తారు. ఈ నెల 15 వరకు

బాలానగర్‌లో రెండో డోస్‌ వాక్సిన్‌ కోసం వచ్చిన జనం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 రెండో డోస్‌ కోసం వివిధ ప్రాంతాల నుంచి బాలానగర్‌కు 

క్యూలో కనిపించని భౌతిక దూరం


బాలానగర్‌, మే 8 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌ కోసం బాలానగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద జనం శనివారం పోటెత్తారు. ఈ నెల 15 వరకు ఎలాంటి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు లేకుండా రెండో డోస్‌ వ్యాక్సిన్‌ వేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో వందలాదిమంది కార్లు, బైకులపై కుటుంబ సభ్యులను వెంటబెట్టుకుని వచ్చి ఆరోగ్య కేంద్రం తెరవకముందే క్యూలో బారులు తీరారు. గంట గంటకు రద్దీ పెరగడం, క్యూలైన్లలో ఉన్నవారు భౌతిక దూరం పాటించక పోవడం, కొందరు మాస్క్‌లు పెట్టుకోకపోవడంతో వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. క్యూలో ఉన్న జనాన్ని కంట్రోల్‌ చేసేందుకు బాలానగర్‌ పోలీసులు పడరానిపాట్లు పడాల్సి వచ్చింది. 


స్థానికేతరులే అధికం.. 

రెండో విడత వ్యాక్సినేషన్‌ కోసం క్యూలో బారులు తీరిన వారిలో స్థానికేతరులే అధికంగా కనిపించారు. శ్రీనగర్‌కాలనీ, ముషీరాబాద్‌, టోలీచౌకీ తదితర ప్రాంతలకు చెందిన వారు బాలానగర్‌ కేంద్రానికి రావడం గమనార్హం. మధ్యాహ్నం వరకు రద్దీ తక్కువగా ఉంటుంది వ్యాక్సిన్‌ తీసుకోవచ్చులే అనుకుని వచ్చిన వారంతా వ్యాక్సిన్‌ తీసుకోకుండానే వెనుతిరగాల్సిన పరిస్థితి చోటు చేసుకుంది.  


వ్యాక్సిన్‌ కేంద్రాలను పెంచండి..

కూకట్‌పల్లి నియోజకవర్గానికి బాలానగర్‌ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఒక్కటే దిక్కు. పర్వత్‌నగర్‌, ఎల్లమ్మబండ, హస్మత్‌పేట్‌, మూసాపేట్‌, కూకట్‌పల్లిలలో అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు ఉన్నప్పటికీ ఆ కేంద్రాలలో కేవలం కొవిషీల్డు టీకా మాత్రమే ఇస్తున్నారు. కొవాగ్జిన్‌ టీకాను బాలానగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మాత్రమే అందుబాటులో ఉంచడంతో కొవాగ్జిన్‌ సెకండ్‌ డోస్‌ తీసుకోవాల్సిన వారంతా బాలానగర్‌ ఆరోగ్య కేంద్రానికి భారీగా తరలివచ్చారు. దీంతో కూకట్‌పల్లి నియోజకవర్గానికి చెందిన వారికి వ్యాక్సిన్‌ అందని పరిస్థతి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాలానగర్‌లోనే కాకుండా మరికొన్ని సెంటర్లలో వ్యాక్సిన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి కొవిషీల్డు, కొవాగ్జిన్‌ టీకాలు అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. ఎక్కడి వారికి అక్కడే వ్యాక్సిన్‌ కేంద్రాలను అందుబాటులో ఉంచితే బాగుంటుందని ప్రభుత్వానికి  ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. 






Updated Date - 2021-05-09T06:15:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising