ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా పరీక్షల కోసం క్యూ

ABN, First Publish Date - 2021-04-17T06:39:33+05:30

కూకట్‌పల్లి ప్రాంతంలో శుక్రవారం 1,031 కరోనా పరీక్షలు నిర్వహించగా 327 మందికి పాజిటివ్‌ వచ్చింది. కూకట్‌పల్లి పీహెచ్‌సీ పరిధిలో 172 పరీక్షలు నిర్వహించగా

సూరారంలో బాలుడికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గాల్లో రోజురోజకూ కరోనా విజృంభిస్తోంది. దీంతో ప్రజలు ఆయా ప్రాంతాల్లోని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, బస్తీదవాఖానాల్లో వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు క్యూ కడుతున్నారు.


కూకట్‌పల్లిలో 327 ..

కూకట్‌పల్లి, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): కూకట్‌పల్లి ప్రాంతంలో శుక్రవారం 1,031 కరోనా పరీక్షలు నిర్వహించగా 327 మందికి పాజిటివ్‌ వచ్చింది. కూకట్‌పల్లి పీహెచ్‌సీ పరిధిలో 172 పరీక్షలు నిర్వహించగా 65 మందికి పాజిటివ్‌, హస్మత్‌పేటలో 82 మందిలో 55, జగద్గిరిగుట్టలో 100 మందిలో 44, బాలానగర్‌లో 165 మందిలో 62, పర్వత్‌నగర్‌లో 66 మందిలో 7, మూసాపేటలో 177 మందిలో 43, ఎల్లమ్మబండ యూసీహెచ్‌సీ పరిధిలో 122 మందిలో 24, బస్తీదవాఖానలైన కేపీహెచ్‌బీ 4వ ఫేజ్‌లో 91 మందిలో 19, వెంకటేశ్వరనగర్‌లో 56 మందిలో 8 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు.


కుత్బుల్లాపూర్‌లో 225...

షాపూర్‌నగర్‌, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): కుత్బుల్లాపూర్‌, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలో శుక్రవారం 757 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 225మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. షాపూర్‌నగర్‌లో 102 మందిలో 26, గాజులరామారంలో 98 మందిలో 9, కుత్బుల్లాపూర్‌ పీహెచ్‌సీలో 134 మందిలో 28, సూరారం పీహెచ్‌సీలో 203 మందిలో 86, దుండిగల్‌ పీహెచ్‌సిలో 119 మందిలో 37, జీడిమెట్ల బస్తీదవాఖానలో 72 మందిలో 27, రంగారెడ్డినగర్‌ బస్తీదవాఖానలో 29 మందిలో 12మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని వైద్యాఽధికారి డాక్టర్‌ నిర్మల తెలిపారు.


శేరిలింగంపల్లిలో 159...

రాయదుర్గం, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో శుక్రవారం 892 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 159 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. హఫీజ్‌పేటలోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో 158 మందిలో 33, రాయదుర్గంలో 103 మందిలో 19, శేరిలింగంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 631 మందిలో 107 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని వైద్యాధికారులు తెలిపారు.




Updated Date - 2021-04-17T06:39:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising