ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తీన్మార్‌ మల్లన్నపై ఫిర్యాదు

ABN, First Publish Date - 2021-05-10T16:33:40+05:30

ఘట్‌కేసర్‌ రెవెన్యూ పరిధిలోని మైసమ్మగుట్టకు సంబంధించిన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/ఘట్‌కేసర్‌ రూరల్‌ : మంత్రి మల్లారెడ్డిపై అసత్య కథనాలు ప్రసారం చేసిన తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ నవీన్‌పై చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్‌ నాయకులు ఆదివారం ఘట్‌కేసర్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఘట్‌కేసర్‌ రెవెన్యూ పరిధిలోని మైసమ్మగుట్టకు సంబంధించిన భూములను మంత్రి మల్లారెడ్డి ఆక్రమించాడని తీన్మార్‌ మల్లన్న ప్రసారం చేశాడని తెలిపారు. మైసమ్మగుట్ట భూములు పట్టాభూములని, సర్వేనెంబర్‌ 543/2లోని 18 ఎకరాల భూమి మాత్రమే ప్రభుత్వభూమి అని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం 18 ఎకరాల భూమి ప్రభుత్వ అధీనంలో ఉందని తెలిపారు. పట్టాభూములకు మంత్రి మల్లారెడ్డికి ఎలాంటి సంబందంలేదని తెలిపారు. 


తీన్మార్‌ మల్లన్న కావాలనే మంత్రిపై అసత్య ప్రసారాలు చేస్తూ, ఆయన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని తెలిపారు. అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కార్యక్రమంలో ఘట్‌కేసర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ముల్లి పావనిజంగయ్యయాదవ్‌, వైస్‌ చైర్మన్‌ మాధవరెడ్డి, కౌన్సిలర్లు బండారి ఆంజనేయులు, బేతాల నర్సింగ్‌రావు, కడుపోల్ల మల్లేష్‌, టీఆర్‌ఎస్‌ ఘట్‌కేసర్‌ మున్సిపల్‌ అధ్యక్షుడు బండారి శ్రీనివా్‌సగౌడ్‌, ముల్లి జంగయ్యయాదవ్‌, అబ్బసాని పొన్నయ్య యాదవ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-05-10T16:33:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising