ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌ బయోటెక్‌కు సీఐఎస్‌ఎఫ్‌ భద్రత

ABN, First Publish Date - 2021-06-15T17:50:37+05:30

దేశంలోనే ప్రముఖ వ్యాక్సిన్‌ తయారీ సంస్థల్లో ఒక్కటైన భారత్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ : దేశంలోనే ప్రముఖ వ్యాక్సిన్‌ తయారీ సంస్థల్లో ఒక్కటైన భారత్‌ బయోటెక్‌కు సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ రక్షణ కవచంగా నిలిచింది. సీఐఎస్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ర్యాంకు అధికారి ఆధ్వర్యంలో 64 పారామిలిటరీ సభ్యులున్న దళం షామీర్‌పేట జినోమ్‌ వ్యాలీలో ఉన్న భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ కార్యాలయానికి రక్షణగా నియమితులయ్యారు. సీఐఎస్‌ఎఫ్‌ రక్షణ అందించే 11వ ప్రైవేటు కార్యాలయంగా భారత్‌ బయోటెక్‌ నిలిచింది. భారత్‌ బయోటెక్‌ కొవిడ్‌ వ్యాక్సిన్‌ కొవాగ్జిన్‌ మాత్రమే కాకుండా చికెన్‌గున్యా, జికా వైరస్‌, జపనీస్‌ ఇన్పిఫెలిటీస్‌లకు వ్యాక్సిన్‌లను రూపొందిస్తోంది.  


ఉగ్రదాడుల బెదిరింపుల కారణంగా దేశీయంగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ను తయారు చేసి, రూపొందిస్తున్న సంస్థకు 24 గంటల పాటు సీఐఎ్‌సఎఫ్‌ రక్షణ కల్పిస్తుందని సీఐఎస్‌ఎఫ్‌ ఉన్నతాధికారి వెల్లడించారు. ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో భారత్‌ బయోటెక్‌ సీఎండీ డాక్టర్‌ కృష్ణా ఎల్లా, జాయింట్‌ ఎండీ డాక్టర్‌ సుచరిత ఎల్లా, సీఐఎస్‌ఎఫ్‌ సదరన్‌ సెక్టర్‌  ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఇన్‌చార్జి అంజనా సిన్హా, డిప్యూటీ ఐజీ శ్యామలా దినవాహితో కలిసి చర్చించారని తెలిసింది. అన్ని రకాల ఉగ్రదాడులను ఎదుర్కొనేందుకు క్యూఆర్‌టీ దళాలు కార్యాలయంలో ఎప్పుడూ అందుబాటులో ఉంటాయని సీఐఎస్‌ అధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2021-06-15T17:50:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising