ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్‌లో రోడ్డుపై శిశువు శరీర భాగం లభ్యం

ABN, First Publish Date - 2021-06-04T13:57:21+05:30

సంఘటనా స్థలానికి సమీపంలో ఉన్న ఖాళీ ప్రదేశాలు, ఓపెన్‌ నాలా, ఇతరత్రా ప్రాంతాల వైపు వెళ్లి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • అన్నికోణాల్లో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

హైదరాబాద్ సిటీ/కుత్బుల్లాపూర్‌ : జీడిమెట్ల డివిజన్‌ ఎంఎన్‌రెడ్డి నగర్‌ ఫేజ్‌-2 హనుమాన్‌ దేవాలయం సమీపంలో ప్రధాన రహదారిపై ఓ శిశువు శరీర భాగం లభ్యమవడంతో స్థానికంగా కలకలం రేగింది. వివరాలిలా ఉన్నాయి. సుమారు 5 నుంచి 7 మాసాలు ఉండే ఓ శిశువు ఛాతి సగభాగంతో కూడిన ఎడమ చేయి రోడ్డుపై పడి ఉండడాన్ని గురువారం ఉదయం స్థానికులు గుర్తించారు. వెంటనే పేట్‌బషీరాబాద్‌ పోలీసులకు సమాచారం అందించడంతో వారు డాగ్‌ స్క్వాడ్‌తో ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. డాగ్‌ స్క్వాడ్‌ సంఘటనా స్థలానికి సమీపంలో ఉన్న ఖాళీ ప్రదేశాలు, ఓపెన్‌ నాలా, ఇతరత్రా ప్రాంతాల వైపు వెళ్లి వెనుతిరిగాయి. 


ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా మృతి చెందిన శిశువును నిర్మానుష్య ప్రదేశాల్లో పడేయంతో వీధి కుక్కలు అక్కడకు లాక్కొచ్చి ఉంటాయని పోలీసులు అభిప్రాయపడ్డారు. అయితే, అదే కాలనీలో గత సెప్టెంబర్‌ నెలలలో మరో శిశువు తల కూడా లభించడం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు అన్నికోణాల్లోంచి దర్యాప్తు చేస్తున్నారు. శిశువు శరీర భాగాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2021-06-04T13:57:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising