ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad లోని ఈ ప్రాంతంలో వరుసగా పిల్లులు ఎందుకు చనిపోతున్నాయ్..!?

ABN, First Publish Date - 2021-07-22T18:22:14+05:30

ఎవరు, ఎందుకు చంపుతున్నారనే అంశాలపై....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • పోలీస్‌స్టేషన్‌లో మహిళల ఫిర్యాదు


హైదరాబాద్ సిటీ/పేట్‌బషీరాబాద్‌ : అనుమానాస్పద స్థితిలో మూగ జీవాలు మృతి చెందుతున్నాయి. వీటిపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ ఇద్దరు మహిళలు పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గుండ్లపోచంపల్లి స్ల్పెండిడ్‌ అపర్ణ ఫామ్‌ డోస్‌ గేటెడ్‌ కమ్యూనిటీలో నివాసం ఉంటున్న అనిత పీటర్స్‌, అనిషా చౌదరీ విల్లా నంబర్‌ 132 సమీపంలో మూగజీవాలు (పిల్లులు)  చనిపోయి ఉండడాన్ని పలుమార్లు చూశారు. వాటిని తీవ్రంగా గాయపరిచి రెండు కాళ్లు తాళ్లతో కట్టి హింసాత్మకంగా చంపుతున్నట్లు గుర్తించారు. దీంతో వారు మంగళవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పుండూరుకు చెందిన ప్రభుత్వ వెటర్నరీ వైద్యులు పిల్లికి పోస్టుమార్టం చేపట్టి పంచనామా చేశారు. వరుసగా మూగజీవాలు మృత్యువాత పడడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరు, ఎందుకు చంపుతున్నారనే అంశాలపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-07-22T18:22:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising