ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Car లేదు కానీ.. కొనబోతున్నట్లు నమ్మించి.. లోన్ తీసుకుని...!

ABN, First Publish Date - 2021-07-11T17:06:22+05:30

రు లేదు కానీ, కొనబోతున్నట్టు నమ్మించాడు. రుణం తీసుకుని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కారు లేకుండానే రుణం
  • కోర్టు ఆదేశాలతో తల్వార్‌ కార్స్‌ నిర్వాహకుడిపై కేసు

హైదరాబాద్ సిటీ/బంజారాహిల్స్‌ : కారు లేదు కానీ, కొనబోతున్నట్టు నమ్మించాడు. రుణం తీసుకుని వాయిదాలు కట్టకుండా ముఖం చాటేసి తిరుగుతున్న తల్వార్‌ కార్స్‌ నిర్వాహకుడిపై కోర్టు ఆదేశాల మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్‌లోని తల్వార్‌ కార్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ డైరెక్టర్‌ సాకేత్‌ తల్వార్‌ 2018లో కారు కొనుగోలు చేసేందుకు రూ.33.73 లక్షల రుణం కావాలని ముత్తూట్‌మనీ లిమిటెడ్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకోసం తప్పుడు డాక్యుమెంట్లు ఇచ్చాడు. కారు షోరూం నిర్వాహకుడు కావడంతో ముత్తూట్‌ నిర్వాహకులు నమ్మి అతనికి రుణం మంజూరు చేశారు. రూ.1.14 లక్షల చొప్పున 36 నెలలు వాయిదాలు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.


రుణం పొందిన నెల రోజుల్లో కారు తాలూకు పత్రాలు అందజేయాలని ముత్తూట్‌ షరతు విధించింది. డబ్బులు చేతికి రాగానే సాకేత్‌ వాటిని సొంతానికి వాడుకున్నాడు. కారుకు సంబంధించిన పత్రాలను సంస్థకు అందచేయలేదు. 15నెలల పాటు వాయిదాలు సరిగ్గానే కట్టాడు. ఆ తరువాత నుంచి కట్టడం మానేశాడు. దీంతో ముత్తూట్‌ నిర్వాహకులు వాకబు చేయగా అసలు ఆయన కారే కొనుగోలు చేయలేదని తేలింది. మిగిలిన డబ్బు కట్టాలని సాకేత్‌ను పలుమార్లు హెచ్చరించినా స్పందించలేదు. దీంతో ఈ యేడాది ఫిబ్రవరిలో ముత్తూట్‌ మినీ సీనియర్‌ లీగల్‌ మేనేజర్‌ సతీష్‌ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. సాకేత్‌ ఉద్దేశపూర్వకంగా తమను మోసం చేశారని సంస్థ కోర్టుకు తెలిసింది. దీంతో సాకేత్‌ తల్వార్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని కోర్టు బంజారాహిల్స్‌ పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు పోలీసులు సాకేత్‌పై పలు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉండగా సాకేత్‌ తల్వార్‌ ఇదే విదంగా గతంలో కూడా అనేక మోసాలకు పాల్పడ్డారు. అతనిపై బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ కేసులు ఉన్నాయి. 

Updated Date - 2021-07-11T17:06:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising