ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘సినారె’కు అక్షర సుమాంజలి

ABN, First Publish Date - 2021-06-12T00:40:34+05:30

జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, పద్మభూషణ్, మాజీ రాజ్యసభ సభ్యులు మహాకవి డా.సి. నారాయణరెడ్డి నాలుగు సంవత్సరాల క్రితం 2017లో నిర్యాణ చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ సార

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, పద్మభూషణ్, మాజీ రాజ్యసభ సభ్యులు మహాకవి డా.సి. నారాయణరెడ్డి నాలుగు సంవత్సరాల క్రితం 2017లో నిర్యాణం చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ సారస్వత పరిషత్ హైదరాబాద్, డా. సి. నారాయణ రెడ్డి వంశీ విజ్ఞాన పీఠం, కేతవరపు ఫౌండేషన్, సంతోషం ఫిల్మ్ న్యూస్ సంయుక్తంగా జూన్ 12న ‘సినారె’కు అక్షర సుమాంజలి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ‘సినారె’ కృతులపై విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు చేసిన విద్వాంసులు ప్రసంగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ అపూర్వ నివాళి కార్యక్రమంలో డాక్టర్ ఎం.కె రాము, డా.వి.ఎల్ నరసింహారావు, డా.నల్లా ప్రభావతి దేవి, డా. నందినేని రవీందర్ తదితరలు ప్రసంగించనున్నారు. ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, భువనచంద్ర, డా. జుర్రుచెన్నయ్య, కళాబ్రహ్మ శిరోమణి డా. వంశీ రామరాజు సురేష్ కొండేటి, డా. కేతవరపు రాజ్యశ్రీ పాల్గొంటారని నిర్వాహకులు వెల్లడించారు. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని జూన్ 12 సాయంత్రం 5 గంటలకు అంతర్జాలంలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్టు పేర్కొన్నారు. 




Updated Date - 2021-06-12T00:40:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising