ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఉత్తరప్రదేశ్‌, హుజూరాబాద్‌లో BJPకి ఓటమి ఖాయం..!’

ABN, First Publish Date - 2021-10-30T15:48:35+05:30

బీజేపీకి ఘోర పరాజయం తప్పదని, శ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • మజ్లిస్‌ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ


హైదరాబాద్‌ సిటీ : వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి ఘోర పరాజయం తప్పదని, శనివారం పోలింగ్‌ జరుగనున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లోనూ బీజేపీ ఓటమి ఖాయమని మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ జోస్యం చెప్పారు. తెలంగాణలో బహుజనవాదాన్ని, లౌకిక కట్టుబాటును చెదరగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. హుజూరాబాద్‌ ప్రజలకు బీజేపీ విభజన రాజకీయాలపై మంచి అవగాహన ఉందని, ఉప ఎన్నికల్లో ఈ పార్టీకి ఓటర్లు గుణ పాఠం చెబుతారన్నారు.


కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విషయంలో పక్షపాత వైఖరి అవలంభిస్తోందని విమర్శించారు. ము ఖ్యంగా ఆర్థిక  సహకారం అందించడంలో వివక్ష ప్రదర్శిస్తోందన్నారు. శుక్రవారం అసదుద్దీన్‌ ఒవైసీ విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ విభజ న రాజకీయాలకు దేశ వ్యాపితంగా ప్రజలు చాలా దగ్గర నుంచి పరిశీలిస్తున్నారన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలను వేధింపులకు గురి చేస్తున్నారని విమర్శించారు. త్రిపురలో 15 మసీదులను ధ్వంసం చేసిన ఘటనకు బాధ్యులైన వారిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ప్రధాన్‌మంత్రి ఆవాస యోజన పథకం కింద ఇప్పటి వరకు ముస్లిం మైనారిటీలకు కనీసం 10 ఇళ్లను కూడా కేటాయించలేదని విమర్శించారు. 


Updated Date - 2021-10-30T15:48:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising