ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీ నిర్ణయాన్ని దేశపౌరులెవరూ మరిచిపోరు: బండి సంజయ్

ABN, First Publish Date - 2021-06-21T17:08:48+05:30

అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ప్రజలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రజలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని కూకట్‌పల్లి బాలాజీనగర్ 115 డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్‌ను బండి సంజయ్ విజిట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి నుండి దేశ ప్రజలను కాపాడేందుకు ప్రధాని మోదీ ఉచిత వ్యాక్సిన్ నిర్ణయం తీసుకున్నారని...మోదీ తీసుకున్న నిర్ణయాన్ని దేశ పౌరుడు ఎవరూ మర్చిపోరని అన్నారు. రాజకీయాలకు అతీతంగా కేంద్రం ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తోందన్నారు. ఇప్పటికే కోటి మందికి రాష్ట్రంలో వ్యాక్సిన్ తీసుకున్నారని చెప్పారు. రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన వారు  2 కోట్ల 68 లక్షలు ఉన్నారని... డిసెంబర్ నాటికి 18 సంవత్సరాలు పూర్తైన అందరికి వ్యాక్సిన్ వేయడం పూర్తి చేస్తామని మోదీ నిర్ణయం తీసుకున్నారని ఆయన చెప్పారు. వ్యాక్సిన్ తీసుకునే విధంగా అందరూ  అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. వ్యాక్సిన్‌పై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దన్నారు.


కేసీఆర్‌కు రాష్ట్ర ప్రజలపై  చిత్తశుద్ధి లేదని..కనీసం వ్యాక్సిన్ తీసుకోవాలని కూడా చెప్పడం లేదని మండిపడ్డారు. ఫ్రీ వ్యాక్సిన్ ఫ్లెక్సీపై ప్రధాని ఫోటో కూడా పెట్టాలనే  ఇంగిత జ్ఞానము లేదని విమర్శించారు. ప్రజల ఆరోగ్యంపై సీఎం కేసీఆర్‌కు పట్టింపు లేదన్నారు. కేసీఆర్‌కు రాజకీయ జిమ్మిక్కిలు తప్ప, ఫ్రీ వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించాలని సోయి లేదని బీజేపీ అధ్యక్షుడు  ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతీయువకుల ఆరోగ్యంతో  సీఎం కేసీఆర్ చేలాగాటమాడుతున్నారన్నారు. ఫ్రీ వ్యాక్సిన్ కృతజ్ఞతకు కూడా మోదీ ఫోటో పెట్టాలేదన్నారు. ఫ్రీ వ్యాక్సిన్‌పై ఇంత వరకు ఉత్తర్వులు ఇవ్వకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చే సౌకర్యాలను వినియోగించుకోని అసమర్థ సీఎం అని వ్యాఖ్యానించారు. 2500 కోట్లు ఇస్తా అన్నావు ఏమైందని ప్రశ్నించారు. రాజకీయాలను పక్కన పెట్టి అందరం కలిసి కట్టుగా కరోనాపై పోరాడుదామని పిలుపునిచ్చారు. యుద్ధ ప్రాతిపదికన 18 సంవత్సరాలు నిండిన అందరికీ  వ్యాక్సిన్ ఇవ్వాలని వెంటనే  ఉత్తర్వులు ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Updated Date - 2021-06-21T17:08:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising