ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో ఇలాంటి పాలన వస్తుందని ఊహించలేదు: బండి సంజయ్

ABN, First Publish Date - 2021-01-26T16:17:07+05:30

తెలంగాణ సాధిస్తే కుటుంబ పాలన వస్తుందని ఎవ్వరూ ఊహించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ సాధిస్తే కుటుంబ పాలన వస్తుందని ఎవ్వరూ ఊహించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఒకే కుటుంబం సమానత్వం కోసం పాలన కొనసాగుతుందని విమర్శించారు. ఈ రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతుందన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణలో పాలన కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజాసామ్యనికి ప్రతీకగా మోదీ పాలన కొనసాగుతుందని చెప్పారు. దేశంలో రైతులను ఆదుకునేందుకు కేంద్రం చట్టాలు తెస్తే... కొన్ని రాజకీయ పార్టీలు దానికి వ్యతిరేకంగా డమ్మీ ఉద్యమం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర వ్యవసాయ చట్టానికి తెలంగాణ రైతులు పూర్తి మద్దతు తెలుపుతున్నందుకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులకు బండి సంజయ్ ధన్యవాదాలు తెలియజేశారు. 

Updated Date - 2021-01-26T16:17:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising