ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేస్తే అగ్నిగుండంగా మారుస్తాం

ABN, First Publish Date - 2021-02-01T05:33:50+05:30

అగ్రవర్ణ పేదలకు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని వీటిని రాష్ట్రంలో అమలు చేస్తే అగ్నిగుండంగా మారుస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌. కృష్ణయ్య అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఆర్‌.కృష్ణయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

   బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య 

బర్కత్‌పుర, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): అగ్రవర్ణ పేదలకు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని వీటిని రాష్ట్రంలో అమలు చేస్తే అగ్నిగుండంగా మారుస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌. కృష్ణయ్య  అన్నారు. దీనిపై సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశామని, ఈ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆదివారం కాచిగూడ మహేంద్ర గార్డెన్‌లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో పలు బీసీ సం ఘాల రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ తొమ్మిది శాతం జనాభా ఉన్న అగ్రవర్ణాలకు పదిశాతం రిజర్వేషన్లు ఏవిధంగా కల్పిస్తారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తక్షణమే స్పందించి ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌లను రాష్ట్రంలో అమలు చేయమని స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పలు సంఘాల నేతలు నీల వెంకటేష్‌, సుధాకర్‌, అంజి, చంటి ముదిరాజ్‌, చంద్రశేఖర్‌గౌడ్‌, కిరణ్‌కుమార్‌గౌడ్‌, మహే్‌షగౌడ్‌, అరుణ్‌కేతన్‌, నాగరాజు, కొండల్‌, శివకుమార్‌, బీసీ వెంకట్‌, నిఖిల్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-02-01T05:33:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising