ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డెక్కని ఆర్ట్‌తో ‘కెటిల్‌’

ABN, First Publish Date - 2021-07-28T06:23:42+05:30

మలక్‌పేట నల్గొండ చౌరస్తాలో జీహెచ్‌ఎంసీ మలక్‌పేట సర్కిల్‌-6 ఏర్పాటు చేసిన కెటిల్‌ డెక్కని ఆర్ట్‌తో కళాత్మకంగా రూపుదిద్దుకుంటోంది.

కళాత్మకంగా రుపుదిద్దుకుంటున్న కెటిల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చాదర్‌ఘాట్‌, జూలై 27(ఆంధ్రజ్యోతి): మలక్‌పేట నల్గొండ చౌరస్తాలో జీహెచ్‌ఎంసీ మలక్‌పేట సర్కిల్‌-6 ఏర్పాటు చేసిన కెటిల్‌ డెక్కని ఆర్ట్‌తో కళాత్మకంగా రూపుదిద్దుకుంటోంది. నల్గొండ చౌరస్తాలోని ఫ్లై ఓవర్‌ కింద ఖాళీగా స్థలంలో అందరినీ ఆకర్షించేలా, పాతబస్తీ సంస్కృతిని ప్రతిబింబించేలా కప్‌ సాసర్లతో కూడిన కెటిల్‌ను ఏర్పాటు చేశారు. అందులో నుంచి నీరు జాలువారుతున్నట్లుగా ఫౌంటెయిన్‌ను తీర్చిదిద్దారు. ఐదారేళ్ల క్రితం రూపుదిద్దుకున్న కెటిల్‌ను మరింత కళాత్మకంగా రూపుదిద్దేందుకు జీహెచ్‌ఎంసీ మలక్‌పేట సర్కిల్‌-6 ఇంజనీరింగ్‌ విభాగం టెండర్‌ను ఆహ్వానించింది. దాదాపు రూ.2.25లక్షల వ్యయం తో హైదరాబాద్‌ సంస్కృతిని ప్రతిబింబించేలా డెక్కని ఆర్ట్‌తో తీర్చిదిద్దే పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే కెటిల్‌లకు డెక్కని ఆర్ట్‌తో తీర్చిదిద్దగా, కప్‌ సాసర్లను తీర్చే పనులను జరగాల్సి ఉంది. మరో వారం రోజుల పాటు ఈ పనులు జరగనున్నాయని డీసీ రజినీకాంత్‌రెడ్డి, ఈఈ రాధిక తెలిపారు. 

Updated Date - 2021-07-28T06:23:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising