ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండు సార్లు ఎంపీని.. పెట్రోల్ పైసలకు పెద్ద కష్టమొచ్చింది: అంజన్ కుమార్

ABN, First Publish Date - 2021-07-05T20:56:49+05:30

టీపీసీసీ కొత్త కమిటీతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చిందని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: టీపీసీసీ కొత్త కమిటీతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చిందని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలతో ప్రజలు విసిగిపోయారన్నారు. సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితి వచ్చిందన్నారు. బట్టేబాజ్ మాటలు చెబుతున్న కేసీఆర్‌కు ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. ప్రాణాలు తీయడం.. పాడే మోయడం కేసీఆర్ నైజమని విమర్శించారు. ఉద్యమ సమయంలో ఉప ఎన్నికలతో కలెక్షన్లు, ఇప్పుడు కాళేశ్వరం‌తో కలెక్షన్లు చేస్తున్నారన్నారు.


రెండు సార్లు ఎంపీగా పనిచేసిన తనకు పెట్రోల్ పైసలకు కష్టమైందని వాపోయారు. ఏడేళ్లలో కేసీఆర్‌కు కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను ప్రజలు కొట్టాలని చూస్తున్నారని, వారి రాజకీయ జీవితం ఇక ఖతమేనని వ్యాఖ్యానించారు. ప్రజలంతా ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్నారు. ఈ నెల 7తేదీన గాంధీభవన్‌లో కొత్త కమిటీ బాధ్యతలు చేపడుతుందన్నారు. తాను ఉజ్జయిని మహంకాళి ఆలయంలో.. పెద్దమ్మ గుడిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పూజలు చేసి భారీ ర్యాలీతో గాంధీభవన్‌కు చేరుకుంటామన్నారు. 

Updated Date - 2021-07-05T20:56:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising