ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి చొరవతో రెండేళ్ల తర్వాత ఇంటికి...

ABN, First Publish Date - 2021-04-23T19:46:55+05:30

‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి చొరవ తీసుకున్నాడని తెలుసుకుని అభినందనలు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/రెజిమెంటల్‌బజార్‌ : పీహెచ్‌డీ చేసి విదేశాల్లో ఉద్యోగం చేసిన ఉన్నత విద్యావంతుడు. కానీ మానసికస్థితి బాగోలేక రెండేళ్ల నుంచి ఎక్కడ ఉంటున్నాడో తల్లిదండ్రులకు, తోబుట్టువులకు తెలియదు. అతడి కోసం కుటుంబసభ్యులు వెతుకుతున్నా ఆచూకీ దొరకలేదు. చివరకు సదరు వ్యక్తి గురువారం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ కారు పార్కింగ్‌లో 15 లగేజీ బ్యాగులతో ఉండటం చూసి గోపాలపురం ఇన్‌స్పెక్టర్‌ సాయిఈశ్వర్‌ గౌడ్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బ్యాగులను, అతడిని గోపాలపురం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అతడి ఫోన్‌లో ఉన్న తండ్రి ఫోన్‌ నెంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారు. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న అతడి కూతురిని పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి అతడిని మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లారు. లగేజీని ఇంటికి తీసుకెళ్లారు. 


తన సోదరుడు మళ్లీ వారి వద్దకు చేరడానికి స్థానిక ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి చొరవ తీసుకున్నాడని తెలుసుకుని అభినందనలు తెలిపారు. తన సోదరుడు ఎమ్మెస్సీ చదివి యుఎ్‌సఏ, జపాన్‌ వెళ్లి వచ్చి మానసిక సమస్యతో బాధపడుతున్నాడని, మందులు వాడుతున్నామని రెండేళ్ల నుంచి అతడి కోసం వెతుకుతున్నామని, ఫోన్‌ టవర్‌ లోకేషన్‌ ఆధారంగా ప్రయత్నించినా దొరకలేదని తెలిపారు. ఫోన్‌ చేసి అప్పుడప్పుడు వాళ్ల అమ్మతో మాట్లాడే వాడని ఎక్కడ ఉన్నాడో చెప్పేవాడు కాదని తెలిపింది. ఎట్టకేలకు తన సోదరుడు తమకు దొరకడానికి సహకరించిన మీడియా ప్రతినిధికి, ఇన్‌స్పెక్టర్‌కు కృత జ్ఞతలు తెలిపింది.

Updated Date - 2021-04-23T19:46:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising