ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిన్నారి సాహసి

ABN, First Publish Date - 2021-01-20T07:56:18+05:30

చిన్నారి బాలుని సాహసం, పట్టుదల ప్రతి ఒక్కరిని అబ్బురపరుస్తున్నారు.

కుమార పర్వతాన్ని అధిరోహించిన సిద్ధార్థరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


5,700 అడుగుల పర్వతాన్ని అధిరోహించిన బుడతడు
ఉప్పల్‌, జనవరి19 (ఆంధ్రజ్యోతి):
చిన్నారి బాలుని సాహసం, పట్టుదల ప్రతి ఒక్కరిని అబ్బురపరుస్తున్నారు. చదువులతో పాటు పర్వతాల అధిరోహణ(ట్రెక్కింగ్‌)లోనూ రాణిస్తున్నాడు తార్నాక వీఎ్‌సటీ కాలనీకి చెందిన 10 ఏళ్ల బుడతడు సిద్ధార్థరెడ్డి.  ఈ బాలుడు ఇపుడు 5వ తరగతి చదువుతున్నాడు. కర్నాటకలోని 5,700 అడుగుల ఎత్తైన కుమార పర్వతాన్ని పెద్దవారితో కలిసి సిద్ధార్థరెడ్డి అధిరోహించాడు. ఈ పర్వతం అధిరోహించిన మరుసటి రోజే  టెడియాండమాల్‌ పర్వతాన్ని కూడా అధిరోహించారు. హైదరాబాద్‌కు చెందిన బీసీఎ్‌ఫ(బ్యాక్‌ప్యాకర్స్‌ అండ్‌ సిటీ ఫ్రీక్స్‌)సంస్థ ఈనెల 16, 17 తేదీల్లో నిర్వహించిన ఈ ట్రెక్కింగ్‌ పోటీల్లో కుమార పర్వతాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కుడు సిద్ధార్థరెడ్డి కావడం విశేషం.  ట్రెక్కింగ్‌లో ప్రతిభను కనబరిచిన సిద్ధార్థకు ఆ సంస్థ ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని అందజేసింది. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ గూడూరు సంతో్‌షరెడ్డి కుమారుడు అయిన సిద్ధార్థరెడ్డి బ్యాడ్మింటన్‌లో కూడా రాణిస్తున్నాడు. క్రీడల్లో నిత్యం శిక్షణ పొందుతుండడం వల్లనే పర్వతారోహణ సాధ్యమైందని, తన తండ్రి ఒక కోచ్‌ వలె తన వెంట ఉండి నిత్యం ప్రోత్సహించడం వల్లనే ఈ సాహస కృత్యాన్ని సాధించగలిగానని సిద్ధార్థ చెబుతున్నాడు.

Updated Date - 2021-01-20T07:56:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising