ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండు కిలోల Gold తో ముంబై నుంచి బస్సులో పయనం.. Hyderabad వచ్చేసరికి షాకింగ్ ఘటన..

ABN, First Publish Date - 2021-08-27T14:26:10+05:30

రెండు కిలోల Gold తో ముంబై నుంచి బస్సులో పయనం.. Hyderabad వచ్చేసరికి షాకింగ్ ఘటన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ సిటీ/ఖైరతాబాద్‌ : బంగారు ఆభరణాలను దుకాణాలకు సరఫరా చేసే ఓ యువకుడు ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో ప్రయాణిస్తుండగా అతడి వద్ద ఉన్న రెండు కిలోలకు పైగా నగల బ్యాగు మాయమైంది. మంగళవారం జరిగిన ఈ సంఘటనపై ముంబైకి చెందిన యజమాని వచ్చి ఫిర్యాదు చేయడంతో గురువారం వెలుగులోకి వచ్చింది. సైఫాబాద్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైకి చెందిన రనూజా జువెలర్స్‌ దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న జువెలరీ దుకాణాలకు తయారు చేసిన ఆభరణాలను సరఫరా చేస్తుంటుంది. 


ఇందులో భాగంగా అందులో పనిచేసే గులాబ్‌ మాలిక్‌(32) హైదరాబాద్‌లోని పలు నగల దుకాణాలకు చేర వేసేందుకు ఆభరణాలను తీసుకొని జబ్బార్‌ ట్రావెల్స్‌ బస్సు ద్వారా ఈనెల 23న ముంబై నుంచి 24న హైదరాబాద్‌కు చేరుకున్నాడు. నగరానికి వచ్చిన అనంతరం అమీర్‌పేటలో నిద్రలేచిన అతడు చూసుకోగా నగల బ్యాగు కనిపించలేదు. బ్యాగులో 2.12 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి. డ్రైవర్‌ను, ఇతరులను విచారించినా ఫలితం లేకపోవడంతో లక్డీకాపూల్‌లో బస్సు దిగి జరిగిన విషయాన్ని యజమానికి తెలిపాడు.


యజమాని శ్రవణ్‌ గెహ్లాత్‌ ముంబై నుంచి నగరానికి వచ్చి పూర్తి వివరాలు తెలుసుకుని సైఫాబాద్‌ పోలీ‌స్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇక్కడ జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు అమీర్‌పేటలో అతడు బ్యాగు లేదన్న విషయం గుర్తించినందున కేసు ఆ పరిధిలోకి వస్తుందని కేసును పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు. బస్సులో ప్రయాణించిన వారి వివరాలను సేకరించి విచారిస్తున్నారు. బాధితుడి వద్ద అన్ని వివరాలను తెలుసుకొని అన్ని కోణాల్లోనూ విచారించనున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-08-27T14:26:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising