ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad: డ్రంకన్ డ్రైవ్‎లో పట్టుబడ్డ 353 మందికి జైల్ శిక్ష

ABN, First Publish Date - 2021-07-28T18:00:45+05:30

నగరంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు సైబరాబాద్ పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. పలు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు సైబరాబాద్ పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. పలు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తూ మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారిపై  పోలీసులు కేసులు నమోదు చేశారు. తాజాగా డ్రంకన్ డ్రైవ్‎లో పట్టుబడ్డ 353 మందికి జైల్ శిక్ష పడింది. పోలీసులు కోర్టుల్లో అభియోగాలను నమోదు చేశారు. విచారణ జరిపిన కోర్టు ఇటీవల 353 మందికి ఒక రోజు నుంచి 20 రోజుల వరకు జైలు శిక్షను ఖరారు చేస్తున్నట్లు వెల్లడించింది. నగరంలోని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల వివరాలు.. కూకట్‎పల్లిలో 79, మియాపూర్ 60, మాదాపూర్ 41, బాలానగర్ 49, రాజేంద్రనగర్ 30, శంషాబాద్ 24, గచ్చిబౌలిలో 50 మంది మందు బాబులకు జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్‎కు ఆర్‎టీవో అధికారులకు పోలీసులు లేఖను పంపారు.

Updated Date - 2021-07-28T18:00:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising