ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హుజురాబాద్‌ ఉపఎన్నికలో ప్రచార హోరు

ABN, First Publish Date - 2021-10-07T21:04:44+05:30

హుజురాబాద్‌ ఉపఎన్నికలో ప్రచార హోరు జోరందుకుంది. హుజురాబాద్ ఉపఎన్నికకు బీజేపీ తరపున 20 మంది స్టార్ క్యాంపైనర్లు ప్రచారం చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుజురాబాద్‌: హుజురాబాద్‌ ఉపఎన్నికలో ప్రచార హోరు జోరందుకుంది. హుజురాబాద్ ఉపఎన్నికకు బీజేపీ తరపున 20 మంది స్టార్ క్యాంపైనర్లు ప్రచారం చేస్తున్నారు. ఆ పార్టీ నేత బండి సంజయ్‌తో పాటు‌‌ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తరుణ్ చుగ్ ప్రచారం నిర్వహించనున్నారు. వీరితో పాటుగా రాష్ట్ర నేతలు డీకే అరుణ, విజయశాంతి, అర్వింద్, రఘనందన్‌రావు, లక్ష్మణ్, మురళీధరరావు, జితేందర్ రెడ్డి, వివేక్ తదితరులు ప్రచారం చేస్తున్నారు. అయితే స్టార్ క్యాంపైనర్ల జాబితాలో ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యే  రాజాసింగ్ లేకపోవడం గమనార్హం.



హుజురాబాద్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ తన అభ్యర్థి నామినేషన్‌తోపాటే ప్రచారాన్ని కూడా ప్రారంభించనున్నది. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన నాటి నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆయన ప్రచారం ప్రారంభించారు. టీఆర్‌ఎస్‌ కూడా ఐదు నెలల క్రితమే ప్రచారం ప్రారంభించింది. కాంగ్రెస్‌ పార్టీ ఆలస్యంగా ఎంట్రీ ఇస్తున్నది. ఈ నెల 2న అధికారికంగా ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకటనర్సింగారావును ఆ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన విద్యార్థి నిరుద్యోగ జంగ్‌ సైరన్‌ కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన ఆందోళనలో పోలీసు లాఠీచార్జీలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిపాలయ్యారు. అభ్యర్థిగా ఎంపికైనా ఆయన ఇప్పటి వరకు నియోజకవర్గానికి రాని పరిస్థితిలో చికిత్సపొందుతూ ఉన్నారు. 

Updated Date - 2021-10-07T21:04:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising