ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద ఉద్రిక్తత
ABN, First Publish Date - 2021-11-20T01:47:28+05:30
ఏపీ రాజకీయాల్లో శుక్రవారం చోటు చేసుకున్న పరిణామాల నేపధ్యంలో హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్ధతి ఏర్పడింది.
హైదరాబాద్: ఏపీ రాజకీయాల్లో శుక్రవారం చోటు చేసుకున్న పరిణామాల నేపధ్యంలో హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్ధతి ఏర్పడింది. పోలీసులకు, తెలుగు యువత కర్యాకర్తలకు వాగ్వివాదం వాగ్వాదం చోటుచేసుకుంది.తెలంగాణ తెలుగు యువత అధ్యక్షుడు పొగాకు జైరాం ఎన్టీఆర్ భవన్ వద్ద ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మాహుతికి ప్రయత్నించాడు. చంద్రబాబును అసెంబ్లీలో అవమానించిన వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల తీరును ఎండగడుతూ ఏపీ సీఎం జగన్ దిష్టి బొమ్మ దగ్థం చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకుంటే తానే కాల్చుకుంటానని పొగాకు జైరాం ఒంటిపై కిరోసిన్ జల్లుకున్నాడు. జైరాంను వారించిన తెలుగు యువత కార్యకర్తలు ఏపీ సీఎం జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Updated Date - 2021-11-20T01:47:28+05:30 IST