ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్ల గుంతలపై హైకోర్టు విచారణ

ABN, First Publish Date - 2021-07-21T03:00:35+05:30

జీహెచ్ఎంసీ పరిధిలోని రోడ్ల గుంతలపై హైకోర్టులో విచారణ జరిగింది. తన పింఛను డబ్బుతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: జీహెచ్ఎంసీ పరిధిలోని రోడ్ల గుంతలపై హైకోర్టులో విచారణ జరిగింది. తన పింఛను డబ్బుతో విశ్రాంత ఉద్యోగి గంగాధర్‌తిలక్ గుంతలు పూడ్చటంపై హైకోర్టులో విచారణ జరిగింది. నగరంలో రోడ్ల పరిస్థితిపై హైకోర్టుకు జీహెచ్ఎంసీ నివేదిక సమర్పించింది. 9,013 కి.మీ. రోడ్లలో 6వేల కి.మీ. పైగా సిమెంట్ రోడ్లు వేశామని కోర్డుకు జీహెచ్ఎంసీ తెలిపింది. రోడ్ల మరమ్మతులు పూర్తి చేసేందుకు ఎన్ని దశాబ్దాలు కావాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజల ప్రాణాలు పోతుంటే మరమ్మతులకు దశాబ్దాలు కావాలా అని హైకోర్టు ఆగ్రమం వ్యక్తం చేసింది. వర్షాకాలంలో గుంతల పూడ్చివేత పనులు రోజూ జరుగుతున్నాయని జీహెచ్ఎంసీ తెలిపింది. వర్షాకాలంలో రోడ్ల మరమ్మతుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని జీహెచ్ఎంసీ వివరించింది. 


సమీకృత రహదారి అభివృద్ధి కార్యక్రమం అమలు చేస్తున్నాం జీహెచ్ఎంసీ పేర్కొంది. ప్రతీ వర్షాకాలం నీళ్లు నిలిచే ప్రాంతాలను గుర్తించి సరిచేయాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రమంతటికీ ఆదర్శంగా నిలిచేలా హైదరాబాద్ ఉండాలని హైకోర్టు సూచించింది. అంతర్జాతీయంగా పేరున్న హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది. వసతులు బాగుంటేనే పెట్టబడులు వస్తాయని కోర్టు పేర్కొంది. రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీని హైకోర్టు ఆదేశించింది. 

Updated Date - 2021-07-21T03:00:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising