ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వ వివాదంపై హైకోర్టు విచారణ

ABN, First Publish Date - 2021-12-24T02:32:48+05:30

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంపై హైకోర్టులో విచారణ జరిగింది. సిటిజన్‌షిప్ యాక్ట్‌పై చెన్నమనేని రమేష్ తరపు న్యాయవాది వేదుల వెంకటరమణ వివరణ ఇచ్చారు. పౌరసత్వం రద్దు చేయాల్సిన అధికారం సెక్రెటరీ, బార్డర్ మేనేజ్మెంట్ మాత్రమే ఇవ్వాలన్నారు. కానీ కానీ ఈ కేసులో అండర్ సెక్రటరీకీ  కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ఇది చట్ట విరుద్ధమని వెంకటరమణ వాదించారు. సెక్షన్ 10(2) ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పౌరసత్వం రద్దు చేసే అధికారాలున్నాయన్నారు. కానీ పిటిషనర్‌కు అందులో ఉన్న ఏ అంశాలు కూడా వర్తించవన్నారు. చెన్నామనేని టెర్రరిస్ట్ కాదని, సంఘ విద్రోహ శక్తి కాదని సెక్షన్ 10(2) వర్తించదని వేదుల పేర్కొన్నారు. చెన్నమనేని సెక్షన్ 5 కింద భారత పౌరసత్వానికి దరఖాస్తు చేసుకున్నారని ఆయన తెలిపారు. దరఖాస్తులో ఒకవేళ తప్పుడు సమాచారం ఇస్తే పౌరసత్వాన్ని రద్దు చేసే అధికారం భారత ప్రభుత్వానికి ఉందని వేదుల పేర్కొన్నారు.


(OCI)ఓవర్ సిస్ ఇండియన్ సిటిజన్‌కు భారత దేశంలో ఎమ్మెల్యే, ఎంపీగా పోటీచేసే అధికారం ఉంటుందా అని హైకోర్టు ప్రశ్నించింది. OCI మీద ఎలాంటి పోటీ చేసే అధికారం లేదని ఆది శ్రీనివాస్ తరపు న్యాయవాది రవికిరణ్‌రావు వాదించారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చెన్నమనేని గెలిచారని కోర్టుకు  వేదుల తెలిపారు. నాలుగు సార్లు దురదృష్టవశాత్తు జర్మనీ పాస్‌పోర్ట్ మీద గెలిచారని ఆది శ్రీనివాస్ తరపు న్యాయవాది రవి కిరణ్ రావు వాదించారు. అనంతరం విచారణను వచ్చే బుధవారానికి హైకోర్టు వాయిదా వేసింది.  

Updated Date - 2021-12-24T02:32:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising