ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రీడాకారులకు ఇస్తున్న ప్రాధాన్యమేంటి?

ABN, First Publish Date - 2021-07-25T08:06:14+05:30

రాష్ట్ర, అంతర్రాష్ట్రస్థాయి క్రీడల్లో రాణించిన వారికి ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్ల(పీఈటీ) నియామకాల్లో నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్స్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్సీటీఈ) ఇస్తున్న ప్రాధాన్యం ఏమిటో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఎన్సీటీఈని ప్రశ్నించిన హైకోర్టు

హైదరాబాద్‌, జూలై 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర, అంతర్రాష్ట్రస్థాయి క్రీడల్లో రాణించిన వారికి ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్ల(పీఈటీ) నియామకాల్లో నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్స్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్సీటీఈ) ఇస్తున్న ప్రాధాన్యం ఏమిటో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. క్రీడల్లో రాణించిన వారిని తెలంగాణ ప్రభుత్వం విస్మరిస్తోందని పేర్కొంటూ దాఖలైన వ్యాజ్యాలలో కౌంటర్లు వేయాలని సీజే హిమాకోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. పలువురు పీఈటీలు, భాషాపండితులు, ఎస్‌జీటీలు దాఖలుచేసిన పిటిషన్లను ధర్మాసనం విచారించింది. పీఈటీల నియామకానికి 2017లో నోటిఫికేషన్‌ వచ్చిందని వారి తరఫున న్యాయవాది రాహుల్‌రెడ్డి అన్నారు. ఇంటర్‌లో 50శాతం పైబడి మార్కులు సాధించిన అభ్యర్థులనే అర్హులుగా పేర్కొందని తెలిపారు. ఈ కేసుల్లో కౌంటర్లు దాఖలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం, ఎన్సీటీఈలు దాగుడుమూతలు ఆడుకుంటున్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్‌కు విరుద్ధంగా నియామక ప్రక్రియ చేపట్టిందని, మొత్తం నియామకాలు ఈ వ్యాజ్యాల్లో వచ్చే తుది తీర్పునకు లోబడే ఉంటాయని స్పష్టం చేసింది. ఈ వ్యాజ్యాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ఎన్సీటీఈని కోర్టు ఆదేశించింది. 


Updated Date - 2021-07-25T08:06:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising