ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామగుండం సీపీకి హైచ్చార్సీ నోటీసులు

ABN, First Publish Date - 2021-02-03T08:33:03+05:30

కాంగ్రెస్‌ కార్పొరేటర్ల అరెస్టుపై రామగుండం పోలీసు కమిషనర్‌కు మానవ హక్కుల కమిషన్‌(హెచ్‌ఆర్సీ) మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్‌ 15లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాంగ్రెస్‌ కార్పొరేటర్ల అరెస్టుపై 

నివేదికకు ఆదేశం


హైదరాబాద్‌, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ కార్పొరేటర్ల అరెస్టుపై రామగుండం పోలీసు కమిషనర్‌కు మానవ హక్కుల కమిషన్‌(హెచ్‌ఆర్సీ) మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్‌ 15లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. గత నెల 23న జరిగిన మునిసిపల్‌ కార్పొరేషన్‌ జనరల్‌ బాడీ మీటింగ్‌లో నిధుల కేటాయింపులపై వివక్ష చూపుతున్నారని ప్రశ్నిస్తే.. మేయర్‌ నుంచి సమాధానం రాలేదని, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను రామగుండం వన్‌ టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌, ఎస్సై అక్రమంగా అరెస్ట్‌ చేశారని ఆరుగురు కాంగ్రెస్‌ కార్పొరేటర్లు హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు. నలుగురు మహిళా కార్పొరేటర్లను అర్ధరాత్రి వరకు పోలీస్‌ స్టేషన్‌లో ఉంచారని ఆరోపించారు. ఈ ఫిర్యాదును విచారణకు స్వీకరించిన హెచ్చార్సీ.. రామగుండం సీపీకి నోటీసులు జారీ చేసింది.

Updated Date - 2021-02-03T08:33:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising