ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రవ్యాప్తంగా భారీగా గంజాయి పట్టివేత

ABN, First Publish Date - 2021-10-30T00:44:42+05:30

రాష్ట్రవ్యాప్తంగా భారీగా గంజాయిని పోలీసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్‌లో హాశీష్ ఆయిల్ (గంజాయి నూనె)ను విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను  బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేసారు. వారి వద్ద నుంచి 200 గ్రాముల హాశీష్ ఆయిల్, ఓ ద్విచక్ర వాహనం, మూడు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


మంచిర్యాల జిల్లోని జన్నారం మండలం లోతోర్రెలో కిలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిపై కేసు నమోదు చేసారు. 


నల్గొండ జిల్లాలోని చిట్యాల దగ్గర వాహన తనిఖీలను పోలీసులు నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా ట్రాలీలో తరలిస్తున్న 100 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏవోబీ నుంచి హైదరాబాద్‌కు ఈ ముఠా గంజాయిని రవాణా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.  మరో ఘటనలో గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని దేవరకొండ పోలీసులు అరెస్ట్ చేసారు. వారి వద్ద నుంచి 23 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 


సిద్దిపేట జిల్లా గౌరారంలో ద్విచక్రవాహనంపై అక్రమంగా తరలిస్తున్న కేజీ 400 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసారు.

Updated Date - 2021-10-30T00:44:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising