ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో కరోనా పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్యశాఖ అప్రమత్తం

ABN, First Publish Date - 2021-03-21T00:38:16+05:30

తెలంగాణలో కరోనా పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. గాంధీ, టిమ్స్ ఆస్పత్రుల అధికారులతో డీఎంఈ రమేష్‌రెడ్డి భేటీ అయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. గాంధీ, టిమ్స్ ఆస్పత్రుల అధికారులతో డీఎంఈ రమేష్‌రెడ్డి భేటీ అయ్యారు. కోవిడ్ రోగులను చేర్చుకునేందుకు సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో సౌకర్యాలు, పడకల అందుబాటుపై చర్చించారు. కరోనా నివారణకు కఠిన చర్యలు తీసుకోవడంతో కోవిడ్-19 పాజిటివ్ కేసులు తగ్గినట్లు తగ్గి.. మళ్లీ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులను చూసి ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో 8 రాష్ట్రాల్లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, హర్యానా, కేరళ రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Updated Date - 2021-03-21T00:38:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising