ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం: హరీష్ రావు

ABN, First Publish Date - 2021-11-28T01:39:04+05:30

ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దామని మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దామని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. నేషనల్ హెల్త్ మిషన్‌లో భాగంగా రాష్ట్రంలో అమలవుతున్న వివిధ కార్య్రక్రమాలపై అధికారులతో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ఆరోగ్య సూచిల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో ఉంచాలన్నారు. ఆరోగ్య తెలంగాణ కలను సాకారం చేయాలన్నారు. ఆరోగ్య సూచీల్లో రాష్ట్ర సగటు కంటే తక్కువ పని తీరు ఉన్న జిల్లాల్లో పురోగతి సాధించాలని ఆయన సూచించారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి నెలవారీ రిపోర్టులు సిద్దం చేసుకోవాలన్నారు.  ప్రతి నెల అధికారులతో సమీక్ష నిర్వహిస్తానని,  ప్రగతి రిపోర్టులతో సిద్దంగా ఉండాలన్నారు.


మలేరియా, డెంగ్యూ వంటి వెక్టర్ బార్న్ రోగాల విషయంలో సంబంధిత జిల్లాలను అప్రమత్తం చేసి తగిన చర్యలు వెంటనే చేపట్టాలన్నారు. పంచాయతీ రాజ్ ,మున్సిపల్ సహా ఇతర శాఖల సహకారం తీసుకోని  పరిసరాల పరిశుభ్రత  పాటించాలన్నారు. వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని  వాక్సినేషన్ అధికారులను ఆదేశించారు. డిసెంబర్ నెలాఖరులోగా వాక్సినేషన్‌ను పూర్తి చేయాలి.

 



Updated Date - 2021-11-28T01:39:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising