ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్యాస్‌ పన్నుపై చర్చకు సిద్ధమేనా..?

ABN, First Publish Date - 2021-10-12T05:30:00+05:30

గ్యాస్‌ పన్నుపై చర్చకు సిద్ధమేనా..?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 - ఈటల రాజేందర్‌కు మంత్రి హరీ్‌షరావు సవాల్‌

ఎల్కతుర్తి, అక్టోబరు12: వంట గ్యాస్‌ ధరల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం పన్నులు విధిస్తున్నట్లు ప్రచారం చేస్తున్న ఈటల రాజేందర్‌ చర్చకు సిద్ధమేనా? అని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీ్‌షరావు సవాల్‌ విసిరారు. మంగళవారం మండలంలోని పెంచికల్‌పేట గ్రామ శివారులో గ్రామీణ వైద్యుల సభ, వడ్డెర కుల ఆశీర్వాద సభలను వేర్వేరుగా నిర్వహించారు. ఈ సమావేశాలకు మంత్రి హరీ్‌షరావు ముఖ్య అతిఽథిగా హాజరై మాట్లాడారు. గ్యాస్‌ధరల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం రూ.291 పన్ను విధిస్తోందని ఈటల రాజేందర్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గ్యాస్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి పన్ను విధించలేదని సూచించారు. ఒకవేళ గ్యాస్‌పై రాష్ట్రం పన్ను విధించినట్లు ఈటల రాజేందర్‌ నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేయడంతో పాటు నేలకు ముక్కు రాస్తానన్నారు. నిరూపించకపోతే ఎన్నికల పోటీ నుంచి ఈటల తప్పుకుంటావా అని హరీ్‌షరావు సవాల్‌ విసిరారు. బీజేపీ ప్రభుత్వం గ్యాస్‌పై 5 శాతం జీఎస్టీ విధించ లేదా అని ప్రశ్నించారు. ఉప ఎన్నికలో గెలిపిస్తే అభివృద్ధి చేస్తానని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివా్‌సయాదవ్‌ అన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, ఆర్‌ఎంపీలు, పీఎంపీలు, వడ్డెర కులస్థులు తదితరులు పాల్గొన్నారు. 



 

Updated Date - 2021-10-12T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising