ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Siddipet: కేటీఆర్‌తో మాట్లాడతా.. హరీశ్ రావు అభయం

ABN, First Publish Date - 2021-07-16T19:23:55+05:30

మున్సిపల్ కార్యాలయంలో చెత్త, హరితహారంపై మంత్రి హరీశ్ రావు శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని వార్డులలో కంపోస్ట్ యార్డులను ఏర్పాటు చేయాలని హరీశ్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట:  మున్సిపల్ కార్యాలయంలో చెత్త, హరితహారంపై మంత్రి హరీశ్ రావు శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని వార్డులలో కంపోస్ట్ యార్డులను ఏర్పాటు చేయాలని హరీశ్ అన్నారు. ప్రతి వీధిలో మొక్కలు నాటాలని, డ్రైనేజ్‌లలో వర్షం నీరు తప్ప మురికి నీరు కనిపించ కూడదని ఆదేశించారు. ప్రతి వీధిలో చెత్త సేకరణ సక్రమంగా జరగాలని, జరగకపోతే ఆ వీధి మున్సిపల్ జవాన్‌ని సస్పెండ్ చేయండన్నారు. మున్సిపల్ ఉద్యోగి, వార్డ్ కౌన్సిలర్, ప్రతి మనిషి చెత్త, చెట్లపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ప్రతి వార్డులో జరిగే శుభకార్యాలకు వెళ్ళే నాయకులు వార్డులోని స్టీల్ బ్యాంక్‌ను ఉపయోగించే విధంగా శ్రద్ధ చూపాలన్నారు. ఇంటిలో గృహిణి, విద్యార్థులను స్వచ్ఛ్ బడికి తీసుకుపోవాలని, చెత్త పైన వారికి అవగాహన కలిగించాలన్నారు. వార్డ్ అభివృద్ధితో పాటు మున్సిపల్‌కి రాబడి వచ్చే విధంగా వార్డు కౌన్సిలర్ చొరవ చూపాలన్నారు. పెండింగ్‌లో ఉన్న మంచినీటి, మున్సిపల్ ట్యాక్స్ ఒకేసారి చెల్లిస్తే అపరాధ రుసుము పడకుండా మంత్రి కేటీఆర్‌తో మాట్లాడతానన్నారు. 

Updated Date - 2021-07-16T19:23:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising