ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేనేతపై జీఎస్టీని రద్దు చేయాలి: చేనేత సహకార సంఘం

ABN, First Publish Date - 2021-12-25T20:28:35+05:30

చేనేత వస్త్రాలపై పెంచిన జీఎస్టీని రద్దుచేయాలని భద్రావతి చేనేత సహకార సంఘం అధ్యక్షురాలు వరకాల ప్రమీల డిమాండ్ చేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: చేనేత వస్త్రాలపై పెంచిన జీఎస్టీని రద్దుచేయాలని భద్రావతి చేనేత సహకార సంఘం అధ్యక్షురాలు వరకాల ప్రమీల డిమాండ్ చేశారు. కరోన మహమ్మారి విజృంభణ,తదనంతర పరిణామాలతో రాష్ట్రంలోచేనేత పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడి పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.చేనేత వృత్తిపై ఆధారపడిన కార్మికులు,వారి కుటుంబాలు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారని పేర్కొన్నారు.దీనికి తోడు నూలు పట్టు దారం ధరలు, రంగులు రసాయన ధరలు విపరీతంగా పెరిగినట్టు తెలిపారు.


వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం, మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు జీఎస్టీని అయిదు శాతం నుంచి పన్నెండు శాతానికి పెంచడం దారుణమని వివరించారు.చేనేత రంగం అభివృద్ధిని కాంక్షించే వారంతా చేనేత వస్త్రాలపై జీఎస్టీని మొత్తానికి మొత్తం తొలగించాలని డిమాండ్ చేయాలని కోరారు.రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం సైతం చేనేత రంగానికి ప్రోత్సాహకాలను అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికులకు రుణాలు అందించాలని నూలు రసాయనాలు రంగులు మీద సబ్సిడీలు పెంచాలని విజ్ఞప్తి చేశారు. 


ప్రతి సోమవారం చేనేత వస్త్రాలను విధిగా ధరించినట్టుగా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతివ్యాపార వాణిజ్య సముదాయాల్లో చేనేత వస్త్ర విక్రయాల కోసం ప్రత్యేక స్టాళ్లను కేటాయించాలని సూచించారు.బిజెపి ప్రభుత్వం చేనేతపై జీఎస్టీని తొలగించే వరకూ పోరాటం కొనసాగిస్తామని ఆమె స్పష్టం చేశారు.జీఎస్టీని పెంచడాన్ని నిరసిస్తూ శనివారం చేనేత కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.

Updated Date - 2021-12-25T20:28:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising