హమాలీల చార్జీల పెంపు - పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి
ABN, First Publish Date - 2021-02-18T00:29:35+05:30
పౌరసరఫరాల సంస్థ గోదాముల్లో పని చేస్తున్న హమాలీ చార్జీలను పెంచుతున్నట్లు పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
హైదరాబాద్: పౌరసరఫరాల సంస్థ గోదాముల్లో పని చేస్తున్న హమాలీ చార్జీలను పెంచుతున్నట్లు పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. మార్చి 1వ తేదీలోగా ఉత్తర్వులు జారీచేసేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెంచిన చార్జీలను జనవరి 2020 నుంచి అమలు చేస్తామని తెలిపారు. ఈ విషయంలో హమాలీలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హమాలీల న్యాయపరమైన ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
హమాలీ సంఘాల విజ్ఞప్తి ప్రకారమే చార్జీలు పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయంలో హమాలీలు బియ్యం లోడింగ్, అన్లోడింగ్ చేసి ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బియ్యం రవాణాకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పేద ప్రజలకు సమయానికి బియ్యం అందేలా చూడాలన్నారు.
Updated Date - 2021-02-18T00:29:35+05:30 IST