ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుర్బుద్ధితోనే కొత్త పార్టీలు: శాసన మండలి చైర్మన్ గుత్తా

ABN, First Publish Date - 2021-04-11T00:53:20+05:30

తెలంగాణ ప్రజలకు హాని చేయాలనే దుర్బుద్ధితోనే రాష్ట్రంలో కొత్త, కొత్త పార్టీలు ఆవిర్భవిస్తున్నాయని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ: తెలంగాణ ప్రజలకు హాని చేయాలనే దుర్బుద్ధితోనే రాష్ట్రంలో కొత్త, కొత్త పార్టీలు ఆవిర్భవిస్తున్నాయని పరోక్షంగా షర్మిల పెట్టబోయే పార్టీపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శలు చేశారు. నల్గొండలోని తన నివాసంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. పోతిరెడ్డిపాడు, సంగమేశ్వర ప్రాజెక్టు ద్వారా నీటి దోపిడీ చేస్తున్నది ఎవరని ఆయన  ప్రశ్నించారు. దానికి సమాధానం చెప్పాలసిన బాధ్యత వారిపై ఉందని ఆయన అన్నారు.


గతంలో ఆంధ్ర పాలనలో తెలంగాణ ప్రజలు దోపిడీకి గురయ్యారయని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. ఇంకా తెలంగాణనే దోచుకోవాలనే ఆలోచనతోనే  కొత్త పార్టీలు  పెడుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మళ్లీ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆ శక్తులే విమర్శిస్తున్నాయని ఆయన ఆరోపించారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం, కులాల వారీగా వేరు చేసి రాజకీయ లబ్ది పొందాలని చూసే పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉందని ఆయన పేర్కొన్నారు. 




కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఓ పెద్ద బ్లాక్ మెయిలరని, గతంలో తన చరిత్ర ఏమిటో ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆయన సూచించారు. తాను కాంట్రాక్టర్‌ను కానని, అభివృద్ధిని కోరుకునేవాన్నని ఆయన తెలిపారు.  వ్యవసాయానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వివిధ వ్యవసాయ పథకాల అవసరాల కోసం 15వేల కోట్ల రూపాయలను సీఎం ఖర్చు చేస్తున్నారని గుత్తా తెలిపారు. 

 

Updated Date - 2021-04-11T00:53:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising